Gold Rates Today : బంగారం కొనాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఇలా

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం...22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000 ఉండగా, 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం పై రూ.63,270గా నమోదయింది.

Telugu Mirror : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే బంగారం, వెండి కొనాలనుకునే వారికి ఈ మధ్య బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. మరి ఈరోజు బంగారం ధరలు పెరిగాయా లేదా తగ్గాయా అనే విషయాన్ని ఇప్పుడు  తెలుసుకుందాం. ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం…బంగారం, వెండి ధరల్లో మార్పు లేదు అనే చెప్పాలి. బంగారం ధర స్థిరంగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,000 ఉండగా, 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం పై రూ.63,270గా నమోదయింది. ఇక వెండి విషయానికి వస్తే వెండి కూడా స్థిరంగా ఉంది.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58, 150 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,420 వద్ద నమోదయింది.

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 58,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,270 నమోదయింది.

Gold Rates Today : Should you buy gold? Gold and silver prices in Telugu states are as follows

Also Read : Gold Rates Today : బంగారం కొనాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఇలా

ఇక చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,600 నమోదయింది. మరి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,930 వద్ద నమోదయింది.

వెండి ధరలు ఇలా : 

దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం,  కిలో వెండి ధర రూ. 78,00గా నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, చెన్నై లో కిలో వెండి ధర రూ. 78,000 ఉండగా, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.76,500 వద్ద నమోదయింది, బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 74, 000 గా నమోదయింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు : 

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధరలో ఎటువంటి మార్పు చోటు చేసుకోలేదు. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,000 నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 63,270 గా నమోదయింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Comments are closed.