Telugu Mirror : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ లో కొనసాగుతుంది. కార్తీక దీపం సీరియల్ శుభం పలికాక అదే సమయంలో బ్రహ్మముడి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రజాధారణ పొందిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
కళ్యాణ్, కావ్య ప్లాన్ వర్క్అవుట్ :
అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. ధాన్యలక్ష్మి మాత్రం విడిగా వంట చేసి తీసుకొస్తుంది. ఏంటా అని చూస్తే మాడిపోయిన బ్రెడ్ ముక్కలో టమాటా ముక్కలు, కీరా ముక్కలు ఉంటాయి. అది చూసిన ధాన్యలక్ష్మి భర్త ఈ గడ్డి నేను తినను, కావాలంటే నువ్వే తిను అని ధాన్యలక్ష్మిని అంటాడు. సరే నేనే తింటాను అని ధాన్యలక్ష్మి చెబుతుంది.
ఇక కావ్య, వాళ్ళ చిన్న మామయ్యకి కూడా తను రుచిగా చేసిన పెసరట్టుని పెడుతుంది. అనామకీ మరియు ధాన్యలక్ష్మి ఇద్దరు ఆ మాడిపోయిన బ్రెడ్ ని తింటారు. కావ్య అపర్ణకు వడ్డిస్తూ, అత్తయ్య ఈరోజు నుండి నేను ఆఫీస్ లో డిజైనర్ గా వర్క్ చేయాలనుకుంటున్నాను అని అడుగుతుంది. ఇంతలో ధాన్యలక్ష్మి, నువ్వు ఇంటికే పరిమితం కావాలి, సమయానికి వండి తగలడితే చాలు అని చులకనగా మాట్లాడుతుంది. వంటింటికే పరిమితం అని చెబుతుంది.
Also Read : Brahmamudi serial jan 27th episode : ఆఫీసుకు వెళ్ళడానికి కావ్య, కళ్యాణ్ ప్రయత్నాలు, మరి ఏం జరగనుంది
నా కోడలు ఎక్కడ ఉండాలో నిర్ణయించడానికి నువ్వు ఎవరు? నా కోడలు మీద పడి ఏడవడం కాదు అని అపర్ణ ధాన్యలక్ష్మి పై విరుచుకుపడుతుంది. కావ్య ఈరోజు నుండి నువ్వు ఆఫీసుకు వెళ్తున్నావ్? ఎవరికి నచ్చినా నచ్చకపోయిన ఇదే నా నిర్ణయం అని అపర్ణ చెబుతుంది. దీనితో కళ్యాణ్, కావ్య హ్యాపీ అవుతారు.
రాజ్ షాక్..
కావ్య రెండు చీరలు చూపించి ఇందులో ఏ చీర బాగుంది అని అడుగుతుంది. బ్లాక్ అండ్ రెడ్ చీర బాగుంది కట్టుకో అని అంటాడు. కానీ కావ్య గ్రీన్ కలర్ చీర కట్టుకుంట, ఎందుకంటే మీ డెసిషన్ మీద నాకు నమ్మకం లేదు అని చెబుతుంది. ఈ చీర సింగారించుకుని ఎక్కడికి వెళ్తున్నావ్ అని రాజ్ అడుగుతాడు. ఆఫీసుకు వస్తున్నాను అని చెబుతుంది కావ్య. రాజ్ షాక్ కి గురవుతాడు.
నువ్వు ఆఫీసుకు రావడం ఏంటి? నేను ఒప్పుకోను అని అంటాడు. మీ పర్మిషన్ ఎవరికీ కావాలి? నాకు అత్తయ్య గారి పర్మిషన్ ఉంది అని కావ్య చెబుతుంది. మా అమ్మ నీకు పర్మిషన్ ఇవ్వడం ఏంటి అని రాజ్ షాక్ అవుతాడు. కిందకి వెళ్ళండి మీకే తెలుస్తుంది అని కావ్య చెబుతుంది.
ఇంతలో రాజ్ కిందకి వెళ్తాడు. ఈలోగా, అపర్ణ వచ్చి.. ఏంటి రాజ్? ఒక్కడివే వెళ్తున్నావ్? కావ్య ఎక్కడ ఉంది అని అడుగుతుంది. నేను ఇక్కడే ఉన్నాను అత్తయ్య అని కావ్య వస్తుంది. దేవుడికి దండం పెట్టుకొని వస్తాను అని చెప్పి దేవుడికి దండం పెట్టుకుంది కావ్య. పరిస్థితుల వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది, తప్పదు నాన్న అని అపర్ణ రాజ్ కి చెబుతుంది.
రాజ్ కోపంగా ఉన్నాడు. ఆఫీసుకు వెళ్ళడానికి కార్ ఎక్కుతుంటే డోర్ ఓపెన్ అవ్వకుండా లాక్ వేసి వెళ్ళిపోతాడు. కావ్య క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంది.