Brahmamudi serial jan 27th episode : ఆఫీసుకు వెళ్ళడానికి కావ్య, కళ్యాణ్ ప్రయత్నాలు, మరి ఏం జరగనుంది

రాత్రి 7:30 నిమిషాలకు టెలివిజన్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రజాధారణ పొందిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

Telugu Mirror : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ లో కొనసాగుతుంది. కార్తీక దీపం సీరియల్ శుభం పలికాక అదే సమయంలో బ్రహ్మముడి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రజాధారణ పొందిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

అపర్ణ, ధాన్యలక్ష్మి ఇద్దరూ మాటకి మాట అనుకుంటారు. వాళ్ళ అత్తయ్య ఇలా గొడవ పడుతూ ఉంటె ఇంటి చిన్న కోడళ్ళు మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా గొడవ పడతారు, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పింది. ఇద్దరూ సరే అత్తయ్య అర్ధం అయింది అని చెప్పి వెళ్తారు.

అత్త, భర్తపై కేసు పెడతానంటున్న స్వప్న..

స్వప్న ప్రెగ్నెంట్ తో ఉంటుంది, ఇక రుద్రాణిని మరియు ఆమె కొడుకుని ఒక ఆట ఆడుకుంటుంది. టాబ్లెట్స్ తీసుకురమ్మని రుద్రాణికి చెప్పింది స్వప్న, రాహుల్ టాబ్లెట్స్ తెచ్చి ఇస్తాడు. వీళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, జైలులో వేసి కఠిన కారాగార శిక్ష వేయండి అని స్వప్న వీడియో రికార్డ్ చేస్తుంది. రుద్రాణి, రాహుల్ ఇద్దరూ ఇప్పుడు మేం ఏం చేశాం అని అడుగుతారు.

brahmamudi-serial-jan-27th-episode-kavya-and-kalyan-try-to-go-to-office-what-will-happen-next

ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్స్ ఇచ్చి న్సంను నా కడుపులోని బిడ్డను చంపాలనుకుంటున్నారా అని మండి పడుతుంది. అందుకే కేసు పెట్టి మీడియాను పిలుస్తానని బెదిరిస్తోంది. ఇంకోసారి ఇలా జరగదు క్షమించమని ఇద్దరు స్వప్నను అడుగుతారు.

మా వంట మేమే చేసుకుంటాం..

brahmamudi-serial-jan-27th-episode-kavya-and-kalyan-try-to-go-to-office-what-will-happen-next

Also Read : Brahmamudi Serial Today Episode : తోడికోడళ్ళ మధ్య గొడవలు, పరిష్కరిస్తున్న అత్త.. ఇకపై కావ్య ఆఫీసుకు

కావ్య వాళ్ళ అత్త దగ్గరికి వచ్చి ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారు అని అడుగుతుంది. అందరూ పెసరట్టు, అల్లం చెట్ని చేయమని చెబుతారు. ఇంతలో ధాన్యలక్ష్మి ఎవరో చేసిన వంట మేము తినడమేంటి? మా వంట మేమే వండుకొని తింటాం అని అంటుంది. ఇంతలో ఆమె భర్త నువ్వు ఎందుకు చేయడం కావ్య ఉంది కదా తను చేసి పెడుతుందిలే అని అంటాడు.ఎవరు తిన్నా, తినకపోయినా కావ్యనే వంట చేస్తుంది అని అపర్ణ చెబుతుంది.

ఆఫీసుకు వెళ్లే ప్లాన్లో కావ్య, కళ్యాణ్..

కావ్య వంట గదిలో వంట చేస్తుండగా కళ్యాణ్ వచ్చి ఇంట్లో ఇద్దరి కోడళ్ల మధ్య జరుగుతున్న గొడవని అడ్డుపెట్టుకుంటే నువ్వు ఆఫీసుకు వెళ్లొచ్చు వదిన అని చెబుతాడు. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు కవి గారు అని చెబుతుంది కావ్య.

అప్పుకి మొదటి రోజే అవమానం..

brahmamudi-serial-jan-27th-episode-kavya-and-kalyan-try-to-go-to-office-what-will-happen-next

అప్పు వాళ్ళ ఫ్రెండ్ మధు సహాయంతో పనిలో చేరుతుంది. అప్పుడు మధు, కళ్యాణ్ ని పెళ్లి చేసుకుంటే అయిపోయేది కదా, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని చెబుతుంది. అప్పుడు అప్పు ఫ్రెండ్ దగ్గర సహాయం అవసరం లేదని చెబుతుంది. అదేంటి కళ్యాణ్ ని నువ్వు లవ్ చేసావ్ కదా అని మధు అడిగి అప్పుని అవమానిస్తుంది. అప్పు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.

కళ్యాణ్ ప్లాన్ వర్క్ అవుట్..

brahmamudi-serial-jan-27th-episode-kavya-and-kalyan-try-to-go-to-office-what-will-happen-next

బయట ధాన్యలక్ష్మి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి కళ్యాణ్ వాళ్ళ వదినను తీసుకొని ఆమె వినేలాగా మాట్లాడుకుంటారు. అది తెలియక ధాన్యలక్ష్మి కళ్యాణ్, కావ్య ఏం మాట్లాడుకుంటున్నారో అని చాటుగా వింటుంది. అయితే ధాన్యలక్ష్మి వినాలని ఇద్దరు గట్టిగా మాట్లాడుకుంటారు. వంటింటి కుందేలుగా ఎందుకు ఉండాలి కవి గారు నేను ఆఫీసుకు వెళ్లి డిజైన్స్ వేస్తాను అని చెబుతుంది. మీ నిర్ణయం మార్చుకోరా వదినా అని కళ్యాణ్ అడిగగా, నా నిర్ణయం మార్చుకోను అని చెబుతుంది. ఇది విన్న ధాన్యలక్ష్మి నువ్వు ఎలా ఆఫీసుకు వెళ్తావో నేను కూడా చూస్తా అని మనసులో అనుకుంటుంది.

Comments are closed.