Gold Rates Today : బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్, తగ్గిన పసిడి, వెండి ధరలు.

గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధర నిన్న, మొన్న కాస్త తగ్గింది ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం...10 గ్రాముల బంగారంపై రూ.100 వరకు తగ్గింది.

Telugu Mirror : బంగారం కొనాలనుకుంటున్నారా? బంగారం కొనుగోలు చేసుకునేవారికి ఈరోజు గొప్ప శుభవార్త అనే చెప్పాలి. ఈ మధ్య స్థిరంగా ఉంటున్న బంగారం ధర రెండు రోజులుగా తగ్గుకుంటూ వచ్చింది. మరి ఈరోజు బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు బంగారం ధర మరింత తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధర నిన్న, మొన్న కాస్త తగ్గింది ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం…10 గ్రాముల బంగారంపై రూ.100 వరకు తగ్గింది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.58,150 ఉండగా ఇవాళ రూ.100 తగ్గి రూ.58,050కి నమోదయింది. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం నిన్న రూ. 63,440గా నమోదు కాగా ఈరోజు రూ.110 తగ్గి రూ.63,330 గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే ఈరోజు భారీగా పెరిగింది.

దేశ రాజధానిలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…

gold-rates-today-good-news-for-those-who-want-to-buy-gold-reduced-green-and-silver-prices

Also Read : Gold Rates Today : బంగారం ప్రియులకు శుభవార్త, పసిడి, వెండి ధరలు నేడు ఇలా..

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58, 200 నమోదు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,480 వద్ద నమోదయింది.

వెండి ధరలు ఇలా ఉన్నాయి :

ఈరోజు వెండి ధరలు బాగా తగ్గాయి. దేశ ప్రధాన నగరాల్లో ఒకటైన ఢిల్లీలో  వెండి ధర పరిశీలించినట్లయితే, వెండి ధర బాగా తగ్గింది. కిలో వెండిపై రూ.300 వరకు తగ్గింది. ఈరోజు వెండి రూ.300 వరకు తగ్గగా, నేడు కిలో వెండి ధర నిన్న రూ.76,800 ఉండగా ఈరోజు అదే వెండి పై రూ.300 తగ్గి రూ.76,500 వద్ద నమోదయింది.  తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖ పట్నంలో నిన్న రూ 78,300 నమోదు కాగా, నేడు రూ.300 తగ్గి కిలో వెండి ధర రూ.78,000 వల్ల నమోదయింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Comments are closed.