Gold Rates Today : బంగారం ప్రియులకు శుభవార్త, పసిడి, వెండి ధరలు నేడు ఇలా..

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700కి నమోదయింది. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,950గా నమోదయింది. ఇక వెండి విషయానికి వస్తే ఈరోజు భారీగా పెరిగింది.

Telugu Mirror : బంగారం కొనాలనుకుంటున్నారా? బంగారం కొనుగోలు చేసుకునేవారికి ఈరోజు శుభవార్త అనే చెప్పాలి. ఈ మధ్య స్థిరంగా ఉంటున్న బంగారం ధర నిన్న స్వల్పంగా తగ్గింది. మరి ఈరోజు బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం. ఈరోజు బంగారం ధర మరింత తగ్గుముఖం పట్టింది. గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధర నిన్న స్వల్పంగా తగ్గగా, ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం…10 గ్రాముల బంగారంపై మరో రూ.50 వరకు తగ్గింది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,700కి నమోదయింది. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,950గా నమోదయింది. ఇక వెండి విషయానికి వస్తే ఈరోజు భారీగా పెరిగింది. కిలో వెండి ధర నిన్న రూ.300 పెరుగగా, ఈరోజు రూ.700 వరకు పెరిగింది. నిన్న ఈరోజు కలిపి వెండి ధర రూ.1000 వరకు పెరిగింది.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 850 నమోదు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,100 వద్ద నమోదయింది.

gold-rates-today-gold-prices-have-been-stable-for-three-consecutive-days-know-how-the-prices-are-today
Image Credit : Everything Style

Also Read : Gold Rates Today : బంగారంపై స్వల్ప తగ్గింపు, 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే?

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 57,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950 నమోదయింది.

ఇక చెన్నై నగరంలో బంగారం విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,300 కు నమోదయింది. 24 క్యారెట్ల బంగారం రూ. 63,600వద్ద కొనసాగుతుంది.

వెండి ధరలు ఇలా ఉన్నాయి :

ఈరోజు వెండి ధరలు భారీగా పెరిగాయి. దేశ ప్రధాన నగరాలు అయినా ముంబై, కోల్కతా, ఢిల్లీ లో వెండి ధర పరిశీలించినట్లయితే, వెండి ధర బాగా పెరిగింది. కిలో వెండిపై రూ.700 వరకు పెరిగింది.తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలూ అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖ పట్నంలో రూ 77,500 నమోదయింది.  చెన్నై లో రూ.77,500 కాగా, బెంగుళూరులో వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. అక్కడ ధర  రూ.72,750 వద్ద నమోదయింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Comments are closed.