Telugu Mirror : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ లో కొనసాగుతుంది. కార్తీక దీపం సీరియల్ శుభం పలికాక అదే సమయంలో బ్రహ్మముడి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రజాధారణ పొందిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
రాజ్ శ్వేతను ఎత్తుకొని హాస్పిటల్ కి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కావ్యకి కళ్ళు తిరగడం వల్ల వాళ్ళ అక్క స్వప్న హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. హాస్పిటల్ లో రాజ్, శ్వేతను చూసిన కావ్య మరింత బాధపడుతూ ఉంటుంది. ఇంతలో స్వప్న వచ్చి రిపోర్ట్స్ వచ్చాయి వెళ్దాం అని ఇంటికి వెళ్తారు.
కుమిలిపోతున్న కావ్య ..
హాస్పిటల్ లో జరిగిన సంఘటన కావ్యకు ఎక్కువగా గుర్తొస్తుంది. తనకు బీపీ డౌన్ అయింది అని, బాగా నీరసంగా ఉంది అని స్వప్న ఇంట్లో అమ్మమ్మకి చెబుతుంది. కానీ కావ్య అదే ఆలోచనలో పడి కుమిలిపోతూ ఉంటుంది.
అప్పు మనసులో ఇక కవి లేడు ..
అప్పు తల్లిద్రండులు ఇంటి ముందు చలి కాచుకుంటున్నారు. ఇంతలో కళ్యాణ్ ఫొటోస్, అతని ఇచ్చిన చీరని ఆ మంటల్లో వేసి కాల్చేస్తుంది. ఇక నా మనసులో ఆ కవి లేడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇప్పటి నుండి ప్రశాంతంగా ఉంటా అని అప్పు తన తల్లిద్రండులకి చెబుతుంది.
తోడి కోడళ్ల మధ్య రగులుతున్న చిచ్చు ..
అనామిక, రుద్రాణి కలిసి వేసిన ప్లాన్ వర్క్అవుట్ అవుతుంది. ఇంట్లో అన్ని పనులు కళ్యాణ్ కి చెప్పి తనని పని వాడిని చేస్తున్నారని రుద్రాణి ధాన్య లక్ష్మి కి లేనిపోని మాటలు నూరి పోస్తుంది. ఆ రుద్రాణి చెప్పిన మాటలు మనసులో పెట్టుకొని రాజ్ అమ్మపై ధాన్య లక్ష్మి విరుచుకుపడుతుంది.
అనామిక మాటలు కళ్యాణ్ విన్నాడా ..
అనామిక తన గదిలో వాళ్ళ అమ్మకి కాల్ చేసి అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా జరుగుతుందని తొందర్లోనే తను అనుకున్నది సాధిస్తుందని చెబుతూ ఉంటుంది. ఇంతలో గదిలోకి కళ్యాణ్ వస్తాడు. మాట్లాడిన మాటలు విన్నాడేమో అని అనుకున్నది అనామిక. కానీ అతను వినలేదు. శోభనానికి ముహూర్తం పెట్టాలి అంటూ మాట్లాడతాడు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…