Guppedantha manasu serial today Episode : కాలేజీలో జరిగే ఫెస్ట్ సక్సెస్ కానివ్వనంటున్న శైలేంద్ర..రిషి లేకుండా వసు ఒంటరిగా.. ఏం జరగనుంది?

గుప్పెడంత మనస్సు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో, రిషి లేకుండా వసు ఒంటరిగా జరిపించే కాలేజీ ఫస్ట్ లో నెగ్గనుందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Mirror : తెలుగు టీవీ సీరియల్స్ లో గుప్పెడంత మనస్సు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉన్న సీరియల్స్ లో ఒకటి. కార్తీక దీపం సీరియల్ తర్వాత అదే సమయానికి టెలికాస్ట్ అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి రేటింగ్ తో బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది. దాని తర్వాత గుప్పెడంత మనస్సు సీరియల్ కి మంచి రేటింగ్ కూడా ఉండేది కానీ సీరియల్ టైమింగ్స్ మారాయి కాబట్టి రేటింగ్ లో కాస్త తగ్గింది.

అయినప్పటికీ గుప్పెడంత మనస్సు సీరియల ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వసుధారని దెబ్బకొట్టడానికి శైలేంద్ర, రావీజ్ డీల్ చేసుకున్న విషయం తెలిసిందే. వసుధారా ఎండీ అయ్యాక మొదటిసారి కాలేజీలో ఫెస్ట్ జరగబోతుంది. జగతి మేడం, రిషి సర్ లేకుండా ఈసారి వసుధారా ఒంటరిగా పోరాటం చేయాల్సి వస్తుంది. దీన్ని అలుసుగా తీసుకొని శైలేంద్ర, వసుధారా బావ అయిన రాజీవ్ ఫెస్ట్ సక్సెస్ అవ్వకుండా ఉండాలని ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు.

Also Read : గోవా కార్నివాల్ మరియు షిగ్మో ఫెస్టివల్ కి ఘనంగా ఏర్పాట్లు, ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 13 వరకు జరుగనున్న వేడుకలు

వసుధారా ఒంటరిగా..

రిషి, జగతి మేడం ఇద్దరు పక్కన లేరు అనే దిగులు ఉన్నప్పటికీ వసుధారా తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తుంది. శైలేంద్ర కాలేజీలో ఉన్న  వసుధారా దగ్గరికి వచ్చి కాలేజీలో నువ్వు జరిపించే ఈ ఫెస్ట్ విజయవంతం కాదని, ఎండీ స్థాయికి నువు సరిపోవు అంటూ ఆమెని బాధపెట్టేలా మాట్లాడతాడు. కానీ వసుధారా శైలేంద్ర మాటలకు భయపడకుండా మాటకు మాటకు మాట్లాడి శైలేంద్రకి కౌంటర్ వేసింది. మావయ్య మహేంద్ర వద్దకు వచ్చి శైలేంద్ర మాట్లాడిన మాటలు వసుధారా చెప్పింది.

Also Read : అయోధ్య పునర్నిర్మాణానికి రూ. 85,000 కోట్లు ఖర్చు, ఇకపై రామమందిరం ద్వారా ఉత్తరప్రదేశ్ కి ₹4 లక్షల కోట్లు వసూలు 

ఇక రాజీవ్ వసుధారా మీద ఉన్న కామంతో వసుధారను చూడడానికి ఫుడ్ డెలివరీ బాయ్ గా వస్తాడు. మాస్క్ పెట్టుకొని రావడంతో వసుధారా  అతన్ని అంతగా గమనించలేదు. కానీ ఎందుకో వసుధారకి అనుమానం వచ్చి మిమ్మల్ని ఎక్కడో చూశాను మాస్క్ తీయండి అని అడిగింది. మహేంద్ర వసుధారణి  పిలవడంతో రాజీవ్ తప్పించుకున్నాడు.

ఫెస్ట్ విజయవంతంగా జరిపించాలని వసుధారా అన్ని పనులు జాగ్రత్తగా తనే దగ్గర ఉండి చూసుకుంటుంది. మరి ఈ ఫెస్ట్ సక్సెస్ అవుతుందా లేక శైలేంద్ర, దేవయాని వేసే ప్లాన్లతో వసుధారా ఇబ్బందుల్లో పడుతుందా అనేది వేచి ఉండాలి.

Comments are closed.