గోవా కార్నివాల్ మరియు షిగ్మో ఫెస్టివల్ కి ఘనంగా ఏర్పాట్లు, ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 13 వరకు జరుగనున్న వేడుకలు

గోవా కాన్వల్ ఫెస్టివల్ 1961వ సంవత్సరం నుంచి మన భారత దేశానికి అధికారికంగా పరిచయం అయింది. అయితే గోవా ప్రభుత్వం ప్రతీ ఫెస్టివల్ కమిటీకి రూ. 20,00,000 కేటాయించింది.

Telugu Mirror : ప్రతి సంవత్సరం నాలుగు రోజుల పాటు ఘనంగా జరిగే గోవా కార్నివాల్ (Goa Carnival) మరియు షిగ్మో ఫెస్టివల్ (shigmo festival) ను ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడానికి గోవా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాటులను చేస్తుంది, ఈ ఫెస్టివల్ కు ప్రపంచ నలుమూలల నుంచి పర్యాటకలు వస్తారు అని గోవా గవర్నమెంట్ (Goa Government) ఆశిస్తున్నారు.

ఈ గోవా కాన్వల్ ఫెస్టివల్ 1961వ సంవత్సరం నుంచి మన భారత దేశంలో ప్రజలకి అధికారికంగా తెలిసింది, కానీ ఈ కార్నివాల్ ఫెస్టివల్ పోర్చుగీస్ రాజు (portugese king) అయిన మోమోచే ద్వారా సుమారు 500 యేళ్ల క్రితమే భారతదేశానికి పరిచయం అయింది. ఈ సంవత్సరం, గోవా టూరిజం ఫిబ్రవరి 9, 2024 నుండి ఫిబ్రవరి 13, 2024 వరకు డిపార్ట్‌మెంట్ గోవా లోని వివిధ నగరాలు అయిన వాస్కో (Vasco) , పోర్వోరిమ్ (porvorim) , పంజిమ్ (Panjim), మపుసాల (mapusa) , మరియు మార్గో (margao) లో ఎన్నో సాంప్రదాయ అంశాలను చేర్చి కార్నివాల్‌ను ఘనంగా సందర్శకులను ఆకర్షించనున్నది.

గోవా ఫెస్టివల్ (Goa Festival) సందర్శకులకు చిరస్మరణీయమైన గుర్తులతో పాటు జీవితం లో మర్చిపోలేని అనుభవాన్ని సృష్టించేందుకు గోవా ప్రభుత్వం ప్రతీ ఫెస్టివల్ కమిటీకి రూ. 20,00,000 కేటాయించింది. కార్నివాల్, షిగ్మో వేడుకలతో పాటు గోవా ప్రభుత్వం శివ జయంతి వార్షిక వేడుకలను కూడా నిర్వహిస్తుంది.

grand-arrangements-for-goa-carnival-and-shigmo-festival-from-february-9-to-february-13
Image Credit : WION

Also Read : అయోధ్య పునర్నిర్మాణానికి రూ. 85,000 కోట్లు ఖర్చు, ఇకపై రామమందిరం ద్వారా ఉత్తరప్రదేశ్ కి ₹4 లక్షల కోట్లు వసూలు

అదేవిధంగా, గోవా యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం అయిన షిగ్మోత్సవ్ కూడా ప్రదర్శించబడుతుంది, ఈ షిగ్మోత్సవ్ వేడుకలో గెలిచిన వారికి బహుమతులు కూడా ఇవ్వనున్నారు.  జానపద నృత్యం – రూ. 25,000, చిత్రరత్ రూ. 75,000, సీనియర్ – జూనియర్స్ ఫ్యాన్సీ డ్రెస్ పోటీ – రూ 10,000, రోమ్‌టామెల్ – రూ. 75,000.

వేడుకల కోసం గోవా ప్రభుత్వం పట్టణాల వారిగా కేటాయించిన వ్యయం రూ. 25,00,000; మార్గోవ్, వాస్కో మరియు పోండాలకు రూ. 15,00,000, ఇతర పట్టణాలకు రూ. 10,00,000 లభిస్తాయి.

కార్నివాల్ ఫెస్టివల్ కు ఎలా చేరుకోవాలి :

మీరు విమానం ద్వారా ప్రయాణించాలి అనుకుంటే దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయం లో దిగి అక్కడ నుంచి క్యాబ్ ద్వారా కార్నివాల్ ఫెస్టివల్ కు చేరుకోవచ్చు, రైలు ప్రయాణం ద్వారా అయితే గోవాలో 2 రైల్వే స్టేషన్లు ఉన్నాయి, వాస్కో-డా-గామా మరియు మార్గోవ్ నుండి మీరు గోవా కార్నివాల్‌కు కనెక్ట్ చేయవచ్చు.

రహదారి ప్రయాణం ద్వారా అయితే గోవాను భారతదేశంలోని ప్రధాన రాష్ట్రాలకు అనుసంధానించే NH4A, NH17 ద్వారా ప్రైవేట్ కార్లు లేదా క్యాబ్‌ల ద్వారా ప్రయాణించవచ్చు.

గోవా కార్నివాల్ టిక్కెట్లు

గోవా కార్నివాల్ 2024కి ఎలాంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు . ఉచితంగా గోవా కార్నివాల్‌లోని ఈవెంట్‌లను ఆస్వాదించవచ్చు.

Comments are closed.