Flight Ticket Prices, Useful Information : విమాన ప్రయాణికులకు శుభవార్త.. తగ్గనున్న విమాన టికెట్ల ధరలు, ఎందుకంటే ?

ప్రయాణ టికెట్లపై డీజీసీఏ చార్జెస్ ను భారీగా తగ్గించింది. కారణం ఏంటో తెలుసుకోండి.

Flight Ticket Prices : విమానంలో ప్రయాణించాలని అందరూ అనుకుంటారు. విమాన ప్రయాణం ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి చాలా మంది వెనకడుగు వేస్తారు. అంత ఖర్చు పెట్టి వినామానాల్లో ప్రయాణించాలంటే సామాన్యులకు పెద్ద విషయం అనే చెప్పాలి. అయితే, సామాన్య ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణించే వెసులుబాటును ఇప్పుడు డైరెక్టరేట్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ (Directorate General of Civil Aviation) కల్పించింది. ప్రయాణ టికెట్లపై చార్జెస్ (Charges) ను భారీగా తగ్గించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్ప్పుడు తెలుసుకుందాం.

విమానంలో ప్రయాణించేటప్పుడు టిక్కెట్టుకు ఎంత ధర అవుతుందో అంత ఛార్జ్ చెల్లిస్తాం. కానీ, ఆ ఛార్జ్ లో టికెట్టు ధరతో పాటు మరికొన్ని చార్జెస్ కలుస్తాయి. ఆ అదనపు చార్జీలు కలవడం వల్ల విమాన టిక్కెట్ ధర విపరీతంగా పెరుగుతుంది. అదనపు సేవలు టిక్కెట్ తో యాడ్ అయి ఉండడంతో అవసరం ఉన్న లేకపోయాలి ఛార్జ్ చెల్లించాలి.

డీజీసీఏ ఏం చెప్పింది ?

ప్రయాణ టికెట్లపై డీజీసీఏ (DGCA)చార్జెస్ ను భారీగా తగ్గించింది. అవసరమైతే అదనపు ఛార్జీలు తీసుకునే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పించాలని లేకుంటే కేవలం విమాన ఛార్జీలను మాత్రమే వసూలు చేయాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. డీజీసీఏ నిర్ణయంతో విమాన టిక్కెట్ ధర తగ్గే అవకాశం ఉంది. నిజానికి, చాలా మంది విమాన ప్రయాణికులకు విమానయాన సంస్థలు అందించే సేవలు అన్నీ అవసరం లేదు.

Flight Ticket Prices

ఈ క్రమంలో డీజీసీఏ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. విమానంలో టిక్కెట్లు తీసుకునేందుకు టికెట్ ధరతో పాటు సర్ చార్జీలు వసూలు చేయొద్దని తెలిపింది. విమానంలో డెలివరీ చేసే భోజనాల ఖర్చును నిషేధించాలని చెప్పింది. అయితే, ప్రస్తుతానికి, విమానయాన టిక్కెట్ ధరలో ప్రయాణీకుల లగేజీని (Passenger’s luggage) తీసుకెళ్లడానికి ఛార్జీలు ఉండేవి.

ప్రయాణీకులు తమ బ్యాగులు తీసుకురాకుంటే ఛార్జ్ వసూలుచేయకూడదని డీజీసీఏ పేర్కొంది. ఫలితంగా, విమాన టిక్కెట్‌ను (Flight ticket) కొనుగోలు చేసేటప్పుడు, ఎటువంటి లగేజ్ రుసుము లేకుండా ప్రయాణికులకు అందించాలని పేర్కొంది. తాజాగా , విమానయాన సంస్థలు సామాను లేకుండా వచ్చే ప్రయాణీకులను జీరో బ్యాగేజీ (zero baggage) ఎంపికను ఎంచుకుని, దాని కోసం డబ్బును తీసివేయడం ద్వారా బ్యాగేజీ ధరను తగ్గించడానికి ఒక పద్ధతిని రూపొందించాయి.

అయితే, అది లేకుండా బేస్ ప్రైస్‌లో లగేజీ ఛార్జీ ఉండదని డీజీసీఏ పేర్కొంది. విమానంలో లగేజ్ తీసుకెళ్లడం వల్ల ఎయిర్‌లైన్ టిక్కెట్‌ (Air line) తో పాటు ఎక్స్‌ట్రా చార్జెస్ కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు విడివిడిగా ఛార్జ్ చేయవలసి ఉంటుంది. దీన్ని విమాన టిక్కెట్‌తో వసూలు చేయకూడదని డీజీసీఏ పేర్కొంది. ఇప్పటివరకు, అథ్లెట్లు తమ టిక్కెట్‌లతో విమానాల్లో ప్రయాణించినప్పుడు, క్రీడా పరికరాలు, సంగీత వాయిద్యం మరియు ఎక్కువ వస్తువుల రుసుములతో సహా అన్ని ఛార్జీలు విమాన టిక్కెట్ ధరలోనే ఉండేవి.

విమాన టిక్కెట్టు ధరతో కలిపి ఉండే సర్ ఛార్జెస్

  • లగేజీ
  • ప్రిఫరబుల్ సీటింగ్
  • భోజనం/స్నాక్స్/కూల్మ డ్రింక్స్
  • సంగీత వాయిద్యాల
  • స్పోర్ట్స్ పరికరాలు

అదనపు చార్జీలు లు టికెట్టు తో కలిపి ఉండడంతో ధర ఎక్కువగా ఉండేది.. DGCA ఈ ఖర్చులలో ప్రతిదానిని విడిగా వసూలు చేస్తే, విమాన టిక్కెట్ యొక్క బేస్ ధర తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు విమానం ఎక్కలేని వారు కూడా ప్రయోజనం పొందుతారు.

Flight Ticket Prices

Comments are closed.