Gold And Silver Effective Prices Today 23-04-2024 : మెట్టు దిగిన బంగారం ధర. ఇప్పుడు 10 గ్రాముల ధర ఎంతంటే

Gold And Silver Effective Prices Today 23-04-2024: దేశంలో బంగారం ధరలు సోమవారం కంటే క్రిందికి దిగివచ్చాయి. ఈ రోజు మంగళవారం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని పలు ప్రముఖ నగరాలలో 10 గ్రాముల బంగారంపై ధరలు స్వల్పంగా రూ.10 తగ్గాయి.

Today’s gold prices in various cities across the country including Telugu states:

Gold And Silver Effective Prices Today 23-04-2024 : పరుగులు పెట్టిస్తున్న పసిడి ధరలు కొంత పడ్డాయి. దేశంలో గోల్డ్ రేట్లు ఒక మెట్టు క్రిందికి దిగి స్వల్పంగా తగ్గాయి. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.10 క్రిందకి దిగి రూ. 67,540గా నమోదయింది. నిన్నటి రోజున అనగా సోమవారం నాడు ఈ రేటు రూ.67,550 గా ఉంది. ఇక 100 గ్రాముల 22క్యారెట్ల పుత్తడి ధర వచ్చేసి రూ. 100 తగ్గి, రూ. 6,75,400గా నమోదయింది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర తాజాగా రూ.6,754గా ఉంది.

అదేవిధంగా 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర సైతం రూ.10 దిగి, రూ. 73,680గా నమోదయింది. నిన్న సోమవారం నాడు ఈ ధర రూ. 73,690 గా పలికింది. మరోవైపు 24 క్యారట్ల బంగారం 100 గ్రాముల ధర రూ.100 తగ్గి, రూ. 7,36,800 వద్ద ఉన్నది. 1గ్రామ్ గోల్డ్ ధర రూ.7,368 గా ఉంది.

Today Gold Rates In Telugu States :

హైదరాబాద్​లో ఈరోజు 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,540గానూ, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 73,680గా పలుకుతోంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 67,540గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి రూ. 73,680గా ఉన్నది. విశాఖపట్నంలో 22 క్యారట్ల పుత్తడి ధర రూ. 67,540 పలుకుతోంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 73,680గా నమోదయింది.

Gold And Silver Effective Prices
Image Credit : Telugu Mirror

Gold Rate Today : మరోవైపు దేశంలోని ముఖ్య నగరాలలో కూడా పసిడి ధరలు శుక్రవారం నాడు క్రిందికి దిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 67,690గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,830గా ఉంది. కోల్​కతాలో ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి రూ. 67,540 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 73,680గా నమోదయింది. ఇంకోపక్క ముంబై, పూణే మరియు కేరళలోనూ ఇవే ధరలు నడుస్తున్నాయి.

అయితే చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 68,440 గాను, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74,660గా పలుకుతోంది. ఇంకోపక్క బెంగళూరులో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 67,540గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,680గా నమోదయింది.

అహ్మదాబాద్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 67,590గానూ, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 73,730గా పలుకుతుంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67,540గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 73,680గా నమోదయింది.

ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి విషయాలు బంగారం రేట్లు పెరగడానికి, తగ్గడానికి కారణం అవుతున్నాయని విపణి మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Silver Prices Today:

మంగళవారం నాడు దేశంలో బంగారం తోపాటు వెండి ధరలు కూడా తగ్గాయి. కేజీ వెండి రేటు రూ.100 క్రిందికి దిగింది. ఈరోజు 100 గ్రాముల వెండి రేటు రూ. 8,540గా పలికింది. అలాగే కేజీ వెండి ధర రూ.100 దిగి, రూ. 85,400 గా నమోదు అయింది. ఈ ధర వచ్చేసి సోమవారం రోజున రూ. 85,500గా కొనసాగింది.

Today Silver Rates In Hyderabad :

హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 88,900 గా నమోదయింది. కోల్​కతాలో కేజీ వెండి రేటు రూ.​85,400గానూ, బెంగళూరులో రూ. 85,900గా పలుకుతుంది.

ప్లాటీనం ధరలు ఈ విధంగా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఈరోజు క్రిందికి దిగాయి. 10గ్రాముల ప్లాటీనం రేటు రూ..10 తగ్గి రూ. 25,000 వద్ద ఉన్నది. నిన్నటి రోజున ఈ ధర రూ. 25,010గా పలికింది.

హైదరాబాద్​లో 10గ్రాముల ప్లాటీనం రేటు రూ. 25,000 గా నమోదు అయింది. ఇవే ధరలు విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాలలో కూడా కొనసాగుతున్నాయి.

Comments are closed.