Gold Rates Today : బంగారంపై స్వల్ప తగ్గింపు, 10 గ్రాముల పసిడి ధర ఎంతంటే?

గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం...10 గ్రాముల బంగారంపై రూ.50 వరకు తగ్గింది.  

Telugu Mirror : బంగారం కొనాలనుకుంటున్నారా? వరుసగా మూడు రోజుల నుండి ఎటువంటి మార్పు లేకుండా ఉన్న బంగారం ధర ఈరోజు ఎలా ఉందో తెలుసుకుందాం. గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం…10 గ్రాముల బంగారంపై రూ.50 వరకు తగ్గింది.

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,750కి నమోదయింది. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం రూ. 63,00గా నమోదయింది. ఇక వెండి విషయానికి ఈరోజు భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.300 వరకు పెరిగింది.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 900 నమోదు కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,150 వద్ద నమోదయింది.

Gold Rates Today : Slight discount on gold, what is the price of 10 grams of pure gold?

 

Also Read : Stock Market today : స్వల్ప తగ్గుదల తరువాత పుంజుకున్న సెన్సెక్స్, నిఫ్టీ

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 57,800 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,050 నమోదయింది. బంగారం ధరలో ఎటువంటి మార్పు లేదు. అక్కడ బంగారం ధర స్థిరంగా ఉంది.

ఇక చెన్నై నగరంలో కూడా గోల్డ్ రేట్ నిన్నటిలాగే ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,300 కు నమోదయింది. 24 క్యారెట్ల బంగారం రూ. 63,600వద్ద కొనసాగుతుంది.

వెండి ధరలు ఇలా ఉన్నాయి :

దేశ ప్రధాన నగరాలు అయినా ముంబై, కోల్కతా, ఢిల్లీ లో వెండి ధర పరిశీలించినట్లయితే, వెండి ధర బాగా పెరిగింది. కిలో వెండిపై రూ.300 వరకు పెరిగింది.దాంతో కిలో వెండి ధర రూ.75,300లకు  నమోదు కాగా, చెన్నై లో రూ.76,800 కాగా, బెంగుళూరులో వెండి ధర కాస్త తగ్గగా అక్కడ ధర  రూ.72,750 వద్ద నమోదయింది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Comments are closed.