Gold Rates Today : బంగారం కొనాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారంపై ఇంత తగ్గుదలా!

ఈరోజు  బంగారం, వెండి పై మళ్ళీ తగ్గుదల చోటుచేసుకుంటుంది. తులం బంగారంపై రూ.610 వరకు తగ్గింది. ఇటు వెండిపై రూ.1000వరకు తగ్గుదల చోటుచేసుకుంది.

Telugu Mirror : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే బంగారం కొనాలనుకునే వారికి ఈరోజు గుడ్ న్యూస్. ఈ మూడు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వచ్చింది. మరి ఈరోజు బంగారం ధర పెరిగిందా లేక తగ్గిందా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు  బంగారం, వెండి పై మళ్ళీ తగ్గుదల చోటుచేసుకుంటుంది. తులం బంగారంపై రూ.610 వరకు తగ్గింది. ఇటు వెండిపై రూ.1000వరకు తగ్గుదల చోటుచేసుకుంది.

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,740 నమోదు కాగా,  24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,990 వద్ద నమోదయింది.  ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండిపై రూ.1000 వరకు తగ్గింది.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57, 890 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,140 వద్ద నమోదయింది.

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 57,740 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,990 నమోదయింది.

Gold Rates Today : Want to buy gold? These are the prices of pasidi and silver in Telugu states
Image Credit : Everything Style

Also Read : Gold Rates Today : బంగారం కొనాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల బంగారం ఎంతో తెలుసా?

ఇక చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,290 నమోదయింది. మరి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.63,590 వద్ద నమోదయింది.

వెండి ధరలు ఇలా : 

దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధర ఈరోజు తగ్గుముఖం పట్టింది. కిలో వెండిపై రూ.1,000 వరకు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం,  కిలో వెండి ధర రూ.75,000 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, చెన్నైలో కిలో వెండి ధర రూ.75,000 ఉండగా, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.73,500 వద్ద నమోదయింది, బెంగుళూరులో కిలో వెండి ధర రూ. 71, 500 గా నమోదయింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు : 

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర తగ్గింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 57,740 వద్ద నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 62,990 గా నమోదయింది. కిలో వెండి రూ.75,000గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Comments are closed.