Gold Rates Today : బంగారం కొనాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఇలా

ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం...22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.58,150 వద్ద నమోదు కాగా, ఈరోజు రూ.58,300 నమోదయింది. అలాగే 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం పై రూ.63,600గా నమోదయింది.

Telugu Mirror : బంగారం కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే బంగారం కొనాలనుకునే వారికి ఈరోజు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. వరుసగా రెండో రోజు బంగారం ధర పెరిగింది. మరి ఈరోజు బంగారం ధరలు ఎంత పెరిగాయి అనే విషయాన్ని ఇప్పుడు  తెలుసుకుందాం. ఈరోజు నమోదయిన వివరాల ప్రకారం…10 గ్రాముల బంగారంపై దాదాపు రూ.150 వరకు పెరుగుదల చోటుచేసుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.58,150 వద్ద నమోదు కాగా, ఈరోజు రూ.58,300 నమోదయింది. అలాగే 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం పై రూ.63,600గా నమోదయింది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండిపై రూ.200 వరకు పెరిగింది.

దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి…

మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58, 450 నమోదు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,750 వద్ద నమోదయింది.

దేశంలో ప్రధాన నగరాలు అయిన కోల్కత్తా, ముంబై, బెంగుళూరు నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల రూ. 58,300 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,600 నమోదయింది.

Gold Rates Today : Want to buy gold? These are the prices of pasidi and silver in Telugu states
Image Credit : Everything Style

Also Read : Gold Rates Today : బంగారం కొనాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఇలా

ఇక చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,300 నమోదయింది. మరి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.64,250 వద్ద నమోదయింది.

వెండి ధరలు ఇలా : 

దేశంలో పలు ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఈరోజు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలు అయిన హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్నంలో నమోదయిన వివరాల ప్రకారం,  కిలో వెండి ధర రూ.77,800 ఉండగా ఈరోజు రూ.200 పెరిగి ఈరోజు రూ.78,000 వద్ద నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధర పరిశీలించినట్లయితే, చెన్నైలో కిలో వెండి ధర రూ.78,000 ఉండగా, ఢిల్లీ, కోల్కతా, ముంబై నగరాల్లో కిలో వెండి ధర రూ.76,500 వద్ద నమోదయింది, బెంగుళూరులో కిలో వెండి ధర రూ.500 తగ్గడంతో రూ. 73,500 గా నమోదయింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు : 

మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే బంగారం ధర భారీగా పెరిగింది. ఇవాళ నమోదయిన వివరాల ప్రకారం, హైదరాబాద్, విజయవాడ మరియు విశాఖపట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 58,300 నమోదయింది. అయితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 63,600 గా నమోదయింది. కిలో వెండి రూ.78,000 గా ఉంది.

పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఒకేరోజులో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దీనికి తోడు అనేక ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల, బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్షంగా ధరలు ట్రాక్ చేస్తే కచ్చితమైన ధరలు తెలుసుకోవచ్చు.

Comments are closed.