ఉమెన్ డెలివరీ భాగస్వాములకు జొమాటో అందిస్తున్న మెటర్నిటీ ఇన్సూరెన్సు ప్లాన్

ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫారం అయిన జొమాటో ఇప్పుడు జొమాటోలో పని చేస్తున్న మహిళా భాగస్వాముల కోసం సమగ్ర ప్రసూతి భీమా పథకాన్ని ప్రవేశపెట్టింది.

Telugu Mirror : మన భారతదేశంలో అతి పెద్ద ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫారం అయిన జొమాటో (Zomato) కమ్యూనిటీ సంబంధాలను మెరుగుపరచడానికి మరియు సహాయం అందించడానికి వారి నిరంతర ప్రయత్నాలలో భాగంగా, ఇప్పుడు Zomatoలో పని చేస్తున్న మహిళా డెలివరీ భాగస్వాముల కోసం మెటర్నిటీ బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. జొమాటో ఈ సెక్టార్‌కు కొత్త. ప్రసవాలకు సహకరించే మరియు గర్భధారణ సమయంలో మహిళలకు సహాయాన్ని అందిస్తుంది.

జొమాటో మహిళల సంరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. డెలివరీ పార్ట్‌నర్స్ కి మెటర్నిటీ ఇన్సూరెన్స్‌ (Maternity Insurance)ను పరిచయం చేసింది. ప్రసవ సమయంలో లేదా తర్వాత తలెత్తే ఏవైనా సమస్యలతో పాటు అన్ని గర్భధారణ సంబంధిత ఖర్చులు ఈ బీమా ప్లాన్ పరిధిలోకి వస్తాయి. మహిళల భాగస్వాములు మరియు కుటుంబాలు దీని నుండి ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. ఈ బేబీ ఇన్సూరెన్స్‌ను టెక్-ఫస్ట్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్, ACKO భాగస్వామ్యంతో  జొమాటో ఒప్పందం కుదుర్చుకుంది. Zomatoలో 1,000 డెలివరీలు పూర్తి చేసిన, అరవై రోజుల పాటు ప్లాట్ ఫారంలో యాక్టివ్‌గా పనిచేసిన మహిళలకు ఈ బీమా అందుబాటులో ఉంటుంది.

భారత్ లో టాటా గ్రూప్స్ నుండి ఐఫోన్స్ తయారీ, చరిత్ర సృష్టించడానికి టాటా రెడీ

Image Credit : IndiaNewsFusion

IANS ప్రకటనలో “గిగ్ వర్కర్స్ కోసం మెటర్నిటీ భీమాను ప్రారంభించడం ద్వారా, మా భాగస్వాములకు వారి మాతృత్వ ప్రయాణంలో అదనపు సహాయాన్ని అందించడం, వారి శ్రేయస్సు మరియు ఆర్థిక భద్రత పట్ల మా అంకితభావాన్ని బలపరచడం మా లక్ష్యం” అని జొమాటో సీఈఓ రాకేశ్ రంజన్ అన్నారు. మేము ప్రతి మలుపులో వారి అవసరాలను తీర్చడంలో వారికి సహాయపడే మార్గాల గురించి ఆలోచిస్తున్నాము అని చెప్పారు.

ప్రతి నెల అకౌంట్‌లోకి 9250 రూపాయలు, పోస్టాఫీసులో అద్భుతమైన పథకం

మా రోజువారీ పనులకు అవసరమైన డెలివరీ భాగస్వాములు మాత్రమే కాకుండా మా సంస్థలోని ప్రతి విభాగంలో మా వ్యాపారంలోని అన్ని అంశాలు మరియు వాటాదారులకు మా నిబద్ధత వర్తిస్తుంది అని చెప్పారు. ఈ భీమా పథకం రెగ్యులర్ డెలివరీకి రూ. 25,000, సి-సెక్షన్ కోసం రూ. 40,000, మరియు  గర్భస్రావం లాంటి గర్భధారణ సంబంధిత సమస్యలకు రూ.40,000 వరకు అందిస్తుంది.

సపోర్టివ్ గిగ్ ఆర్థిక వ్యవస్థని ప్రోత్సహిస్తుంది 

Zomato మహిళా డెలివరీ భాగస్వాముల వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అవసరాలను తీర్చడం ద్వారా గిగ్ ఆర్ధిక వ్యవస్థని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కార్పొరేషన్ ప్రకారం, ఇది ఆరోగ్య బీమా, అంబులెన్స్ సేవలు, ప్రమాద రక్షణ మరియు ఉద్యోగం కోల్పోయే సందర్భంలో సహాయం అందించడం వంటివి  గతంలో వెల్లడించిన ప్రయోజనాలను అందిస్తుంది.

Comments are closed.