AP TET 2024 Results ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2024) ఫలితాలు ఈ నెల 14న వెల్లడి కానున్నాయి. AP TET 2024 రెస్పాన్స్ షీట్లు ఇప్పటికే విడుదల అయ్యాయి. టెట్ పరీక్షలు ఫిబ్రవరి 27న ప్రారంభమై మార్చి 9న ముగిసిన విషయం మన అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు టెట్ పరీక్షలకు హాజరైన దరఖాస్తుదారుల కోసం AP విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://aptet.apcfss.in/లో రెస్పాన్స్ షీట్స్ ని అందుబాటులో ఉంచింది. TET పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ వెబ్సైట్ నుండి వారి యూజర్ ID మరియు పుట్టిన తేదీని ఉపయోగించి రెస్పాన్స్ షీట్లను పొందవచ్చు.
ఇంకా, అభ్యర్థులు ఆన్లైన్లో ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు కూడా తెలియజేయవచ్చు. ఇక ఫైనల్ ఆన్సర్ కీ మార్చి 13న అందించడం జరుగుతుంది. AP TET ఫలితాలు 2024 మార్చి 14న వెల్లడికానున్నాయి. AP DSCలో TET మార్కులు 20% వెయిటేజి ఉన్న సంగతి తెలిసిందే.
అప్డేట్ అయిన AP DSC పరీక్ష తేదీలు
AP DSC యొక్క కొత్త షెడ్యూల్ 2024 ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహించే AP DSC 2024 పరీక్షల టైమ్టేబుల్కు పాఠశాల విద్యా శాఖ సవరణలను ప్రకటించింది. ఏపీ డీఎస్సీ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు జరుగుతాయని విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షల మధ్య గడువును ఖరారు చేస్తూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై స్పందించిన విద్యాశాఖ కొత్త షెడ్యూల్ను ప్రచురించింది.
ఫలితంగా మార్చి 30న పరీక్షలు ప్రారంభమవుతాయని ఏపీ విద్యాశాఖ ప్రకటించింది.అయితే మార్చి 20 నుంచి అభ్యర్థులు పరీక్షా కేంద్రాలను ఎంచుకోవడానికి ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. హాల్ టిక్కెట్లు మార్చి 25 నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి.
AP TET పరీక్షలు 2024 తర్వాత త్వరలో DSC పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఫలితంగా అభ్యర్థులకు ప్రిపరేషన్ కావడానికి తక్కువ సమయం ఉంది. అభ్యర్థులు ఒత్తిడికి లోనవుతున్నారని కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్లపై వాదనలు విన్న హైకోర్టు.. టెట్, టీఆర్టీ మధ్య నాలుగు వారాల గ్యాప్ ఉండేలా పరీక్షలు నిర్వహించాలని మార్చి 4న ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కొత్త షెడ్యూల్ను ప్రకటించింది.