AP Government started Rabi crop procurement: అన్నదాతలకు శుభవార్తను అందించిన ఏపీ సర్కార్, రబీ పంట కొనుగోళ్లు ప్రారంభం

ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ మార్క్‌ఫెడ్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. రబీ 2023-24 సీజన్‌లో 7 లక్షల ఎకరాల్లో మినుము సాగు చేయడం జరిగింది.

AP Government started Rabi crop procurement: అన్నదాతలకు శుభవార్త. ప్రభుత్వం రైతులకు మరో శుభవార్తను అందించింది. దీంతో పెద్ద సంఖ్యలో రైతులకు ఆసరాగా నిలిచే అవకాశం ఉంది. ఇంతకీ, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? రైతులకు ఎందుకు లాభం? వంటి విషయాల గురించి తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ అన్నదాతలకు జగన్ ప్రభుత్వం శుభవార్త అందించింది. రబీ పంటల కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించినట్టు తెలిపింది. గత నెలలో పప్పుధాన్యాలు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వగా, ఇప్పుడు మినుము, పెసర, వేరుశనగలు కూడా కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చారు.

ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ మార్క్‌ఫెడ్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది. రబీ 2023-24 సీజన్‌లో 7 లక్షల ఎకరాల్లో మినుము సాగు చేయడం జరిగింది. 7.50 లక్షల ఎకరాల్లో మినుము సాగు ఉంది. 1.92 లక్షల ఎకరాలు అదనంగా సాగు చేశారు.

ఏకంగా 1.61 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగులో ఉన్నాయి. మినుము 5.26 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, పెసలు 84 వేల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇంకా శనగలు క్వింటాల్‌కు రూ.5,440, పెసలు క్వింటాల్‌కు రూ.8,558, మినుములు క్వింటాల్‌కు రూ.6,950, వేరుశనగ క్వింటాల్‌కు రూ.5,850గా ప్రభుత్వం కనీస మద్దతు ధరను నిర్ణయించింది.

అలాగే గత నెలాఖరులో కనీస మద్దతు ధరకు 1,14,163 టన్నుల కందుల సేకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 97,185 టన్నుల మినుము, 46,463 టన్నుల వేరుశనగ, 17,505 టన్నుల పెసల్‌ను ఆర్‌బీకేల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏపీ మార్క్‌ఫెడ్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది.

పంట నమోదు (ఈ-క్రాప్) ఆధారంగా ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. కొనుగోలు తేదీ పంట తేదీ ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. బ్రోకర్ల ముప్పును తొలగిస్తూ బయోమెట్రిక్ ను  అతప్పనిసరి చేశారు. సేకరించిన వస్తువులను సులభంగా ట్రాక్ చేయడానికి బ్యాగ్‌లకు QR కోడ్/RFID ట్యాగ్ లను వేస్తున్నారు. రబీ పంటల సేకరణకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

వారు శనగలు, మినుములు, పెసల్ మరియు వేరుశెనగలను సేకరిస్తున్నారు. మార్కెట్‌లో కనీస మద్దతు ధర లభించని రైతులు తమ పంట సమాచారాన్ని ఆర్‌బీకేలో నమోదు చేసుకోవాలని ప్రభుత్వ అధికారులు చెప్పారు. మార్కెట్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఏ రైతు కూడా తమ ఉత్పత్తులను కనీస మద్దతు ధర కంటే తక్కువకు విక్రయించేందుకు తొందరపడకూడదు.

AP Government started Rabi crop procurement

 

 

 

 

 

 

 

 

 

Comments are closed.