Basara IIIT Admissions : ట్రిపుల్ ఐటీ బాసర ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల, వివరాలు ఇవే!

బాసర ట్రిపుల్ ఐటీ, 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఆరేళ్ల బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది.పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Basara IIIT Admissions : తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (Basara IIIT) 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఆరేళ్ల బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. RGUKT వీసీ ప్రొఫెసర్ వి.వెంకటరమణ మే 27వ తేదీన అడ్మిషన్ నోటీసును జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది దరఖాస్తు ప్రక్రియను ఎస్‌ఎస్‌సీ బోర్డు (SSC Board) సర్వర్‌తో లింకు చేశామన్నారు. హాల్‌టికెట్‌ నంబర్‌, విద్యార్థి పేరు వంటి వివరాలను సబ్మిట్ చేసిన తర్వాత వెంటనే చూపిస్తామని తెలిపారు.

విద్యార్థుల ఇంటర్ మార్కుల ఆధారంగా బీటెక్‌లోని వివిధ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెంకటరమణ తెలిపారు. మొదటి సంవత్సరం ఖర్చు రూ.37 వేలు కాగా, రీయింబర్స్‌మెంట్‌కు (Reimbursement) అర్హులైన వారు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతే కాకుండా రూ.1000 రిజిస్ట్రేషన్ ఫీజు, రూ.2,000 క్యాష్ డిపాజిట్, రూ.700 ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తం రూ.3,700 చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిషన్లపై మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ లేదా హెల్ప్ లైన్ నంబర్లు 7416305245, 7416058245, 7416929245లను సంప్రదించవచ్చని వీసీ పేర్కొన్నారు.

జూన్ 1 నుంచి దరఖాస్తులు ప్రారంభం.
షెడ్యూల్ ప్రకారం, జూన్ 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్ 22 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పిహెచ్‌డి, ఎన్‌సిసి మరియు గేమ్స్ వంటి ప్రత్యేక కేటగిరీలోని విద్యార్థులు జూన్ 29 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎంపికైన విద్యార్థుల జాబితాను జూలై 3న విడుదల చేస్తారు. జూలై 8 నుంచి జూలై 10 మధ్య విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు.ఓసీ, ఓబీసీ విద్యార్థులు రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450 చెల్లించాలి.

Basara IIIT Admissions
మొత్తం సీట్ల సంఖ్య ఎంత?

మొత్తం 1650 ఇంటిగ్రేటెడ్ బి.టెక్ (ఇంటర్ + బి.టెక్) సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. యూనివర్సిటీలో 1500 సీట్లు ఉండగా, 10% EWS కోటా అదనంగా 150 సీట్లను భర్తీ చేస్తుంది. మొత్తం సీట్లలో 85 శాతం తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఉండగా.. మిగిలిన 15% సీట్లకు రాష్ట్రంతో పాటు ఏపీ విద్యార్థులకు అవకాశం ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు 5% సూపర్‌న్యూమరీ సీట్లు లభిస్తాయి.

దరఖాస్తుదారులు తమ మొదటి ప్రయత్నంలోనే పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. జూన్ 1, 2024 నాటికి విద్యార్థుల వయస్సు 18 సంవత్సరాలు మించకూడదు. SC మరియు ST విద్యార్థులకు 21 సంవత్సరాల వరకు మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వారి మార్కుల్లో 0.40 కలుపుతారు . ఇద్దరు విద్యార్థుల స్కోర్లు సమానంగా ఉంటే, సబ్జెక్ట్ ల వారీగా చూసి ఎంపిక చేస్తారు. ముందుగా, గణితం, సైన్స్, ఇంగ్లీష్, సోషల్ సైన్స్ మరియు ఫస్ట్ లాంగ్వేజ్ గ్రేడ్ ఆధారంగా తీసుకుంటారు. అది కూడా సమానంగా ఉంటే, వారి పుట్టిన తేదీ ఆధారంగా ఎవరు పెద్ద అయితే వారిని ఎంపిక చేస్తారు. అది కూడా సమానంగా ఉంటే హాల్ టికెట్ ర్యాండమ్ నంబర్ సిస్టమ్ ను ఉపయోగిస్తారు.

అడ్మిషన్ల షెడ్యూల్ ఇలా ఉంది.

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : జూన్ 1, 2024.
  • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 22, 2024.
  • స్పెషల్ కేటగిరీ విద్యార్థుల దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 29, 2024.
  • సీట్ల కేటాయింపు (ప్రత్యేక కేటగిరీ కాకుండా) : జూన్ 3, 2024.
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ : 08/06/2024 – 10/06/2024

Basara IIIT Admissions

Comments are closed.