national testing agency నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(NTA) లో పరీక్ష లేకుండానే ఉద్యోగాలు. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పలు ఖాళీ పోస్ట్ ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల యొక్క అర్హత మరియు అనుభవం ఆధారంగా ఎంపిక చేయబడతారు. ప్రకటించిన పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ ఏప్రిల్ 15.

national testing agency నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. ఈ ఉద్యోగ నియామకాల ద్వారా ఖాళీగా ఉన్న 44 పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. సీనియర్ ప్రోగ్రామర్, డిప్యూటీ డైరెక్టర్, రీసెర్చ్ సైంటిస్ట్, ప్రోగ్రామర్, అసిస్టెంట్ డైరెక్టర్, సీనియర్ సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ పోస్టులు ప్రకటించిన నోటిఫికేషన్ లో ఉన్నాయి. ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. ఆసక్తి ఉండి,అర్హత కలిగిన అభ్యర్థులు NTA అధికారిక వెబ్‌సైట్ ntarecruitment.ntaonline.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 15. NTA ప్రకటించిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు పోస్టుల యొక్క వివరాలను, కావలసిన విద్యార్హత, ఏజ్ లిమిట్, ఎంపిక విధానం తదితర వివరాలను పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యం. ఈ వివరాలకు సంబంధించిన సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు

ప్రకటించిన పోస్ట్ లు మొత్తం: 44

పోస్ట్/ఖాళీల సంఖ్య

•సీనియర్ ప్రోగ్రామర్/ 02 పోస్టులు

•డిప్యూటీ డైరెక్టర్/ 06 పోస్టులు

•రీసెర్చ్ సైంటిస్ట్ ‘B’/ 01 పోస్ట్

•ప్రోగ్రామర్/ 02 పోస్టులు

•రీసెర్చ్ సైంటిస్ట్ ‘A’/ 02 పోస్టులు

•అసిస్టెంట్ డైరెక్టర్/ 11 పోస్టులు

•సీనియర్ సూపరింటెండెంట్/ 12 పోస్టులు

•సీనియర్ అసిస్టెంట్/ 08 పోస్టులు

విద్యార్హతలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ లేదా మాస్టర్ డిగ్రీని కలిగి ఉండాలి. అదేవిధంగా దరఖాస్తు చేసుకునే పోస్ట్ ప్రకారం అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తుదారుల వయోపరిమితి

ఈ ఉద్యోగ నియామకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి పోస్టులను బట్టి మారవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈక్రింద ఇవ్వబడిన లింక్ ను తెరచి అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవాలి

NTA నుండి వెలువడిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్‌ని ఇక్కడ చూడండి

https://ntarecruitment.ntaonline.in

ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ

నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ద్వారా ప్రకటించబడిన ఖాళీ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క ఎంపిక, అభ్యర్ధుల అర్హత మరియు అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడుతారు.

national testing agency

 

 

 

 

Comments are closed.