TS SSC Results 2024, Useful News : నేడే తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదల..ఈ లింక్ మీద క్లిక్ చేసి మీ రిజల్ట్స్ చెక్ చేసుకోండి.

ఈరోజు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో కార్యదర్శి బుర్రా వెంకటేశం 10వ తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు.

TS SSC Results 2024 : తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు విద్యార్థులు అందరు ఈరోజు వచ్చే ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 10వ తరగతి ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది.

ఈరోజు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ (Commissioner of Education) కార్యాలయంలో కార్యదర్శి బుర్రా వెంకటేశం 10వ తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ విషయమై విద్యాశాఖ గతంలోనే వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే పది, ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యాయి.

తెలంగాణ 10వ తరగతి పరీక్షలు.

ఈ ఏడాది తెలంగాణ 10వ తరగతి పరీక్షలకు 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ పరీక్షలు మొత్తం 2,676 కేంద్రాల్లో జరుగుతాయి.

TS SSC Results 2024

ఈసారి ఫలితాలు కూడా తొందరగానే.

ఈ సంవత్సరం 10వ తరగతి పరీక్షలు మార్చి 18 మరియు ఏప్రిల్ 2 మధ్య జరిగాయి. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు.

10వ తరగతి జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ (Spot Valuation) ప్రక్రియ ఏప్రిల్ 3న ప్రారంభమ, ఏప్రిల్ 20న ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో మదింపు ప్రక్రియ జరిగింది. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ముందుగానే 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

పదో తరగతి ఫలితాలను ఎలా తనిఖీ చేయాలి?

  • తెలంగాణ 10వ తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు http://bse.telangana.gov.inని సందర్శించండి.
  • హోమ్ పేజీలో ‘SSC Results 2024’ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • మీ మార్కులను చూడడానికి మీ హాల్ టిక్కెట్ నంబర్‌ను నమోదు చేసి, సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి.
  • మీ ఫలితాలు కనిపిస్తాయి. మార్కుల మెమోను (Marks Memo) పొందడానికి, ప్రింట్ ఆప్షన్ (Print option) ను క్లిక్ చేయండి.

Comments are closed.