TSPSC Group 1 Prilims Exam: టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఓఎంఆర్ ఫార్మాట్ లోనే, హాల్ టికెట్ల విడుదల ఆ రోజు నుండే!

తెలంగాణలో మొత్తం 563 గ్రూప్-1 సర్వీస్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు హాల్ టిక్కెట్లు జూన్ 1న విడుదల కానున్నాయి.

TSPSC Group 1 Prilims Exam: తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమినరీ రాత పరీక్షకు టీఎస్‌పీఎస్సీ (TSPSC) సన్నాహాలు చేస్తోంది. TSPSC గ్రూప్ 1 పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాలలో నిర్వహించాలని TSPSC కమిషన్ నిర్ణయించింది. జూన్ 9న టీఎస్ పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షపై టీఎస్ పీఎస్సీ కమిషన్ క్లారిటీ ఇచ్చింది.

తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆఫ్‌లైన్‌లో జరుగుతుందని కన్ఫామ్ చేశారు. అదేంటంటే.. టీఎస్ పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఓఎంఆర్ ఫార్మాట్ (OMR Format) లోనే నిర్వహించనున్నట్లు టీఎస్ పీఎస్సీ కమిషన్ పేర్కొంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన దరఖాస్తుదారులకు అక్టోబర్ 21న TSPSC గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ ఇప్పటికే పేర్కొంది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ గ్రేటర్ హైదరాబాద్‌ (Greater Hyderabad) లో జరగనుంది.

తెలంగాణలో మొత్తం 563 గ్రూప్-1 సర్వీస్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈసారి సుమారు 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుదారులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వారందరికీ ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించడం కష్టంగా భావించిన కమిషన్, ఆఫ్‌లైన్‌ (Offline) లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

TSPSC గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టిక్కెట్లు (HAll Tickets) పరీక్షకు వారం రోజుల ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే, గ్రూప్ 1 పరీక్ష హాల్ టికెట్లు జూన్ 1 నుండి అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు. తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో నిర్ణీత కటాఫ్‌కు పైగా స్కోర్ చేసిన అభ్యర్ధులు ప్రధాన పరీక్షకు అర్హత సాధిస్తారు.

tspsc-notification-released-group-1-notification-released-by-tspsc-the-details-are-these

Also Read: NDA Exam Notification: సెలెక్ట్ అయితే శిక్షణతో పాటు ఉద్యోగం మీ సొంతం, అప్లై చేసుకోడానికి చివరి తేదీ దగ్గరికి వస్తుంది

కాగా, గ్రూప్ 1 ఖాళీల భర్తీకి ముందస్తు ప్రకటనను రద్దు చేస్తున్నట్లు TSPSC ఈ సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. గత ప్రభుత్వం ఏప్రిల్ 2022లో 503 ఓపెన్ పొజిషన్లను జాబితా చేస్తూ గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష పేపర్ (Group1 Priliminary Exam Paper) లీక్‌ల కారణంగా వాయిదా పడింది మరియు నిబంధనలు సరిగ్గా పాటించలేదని రెండవ ప్రిలిమినరీ పరీక్షను కూడ రద్దు చేశారు. మరో 60 కొత్త పోస్టులను కలిపి మొత్తం 563 ఖాళీల కోసం కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అభ్యర్థులు పూర్తి వివరాలను https://www.tspsc.gov.in/లో చూడవచ్చు.

Comments are closed.