TSRTC jobs : తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగాలకు భర్తీ, కొత్త నోటిఫికేషన్ విడుదల

ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న యువతకు సువర్ణావకాశం. ఆర్టీసీ డిపాట్మెంట్ లో ఖాళీగా ఉన్న 150 పోస్టులకు నేడు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నట్టు టీఎస్ఆర్టిసి ఎండీ సజ్జనార్ తెలిపారు.

Telugu Mirror : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TSRTC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న యువతకు ఇది ఒక సువర్ణావకాశం లాంటిది. ఆర్టీసీ డిపాట్మెంట్ లో ఖాళీగా ఉన్న 150 పోస్టులకు నేడు నోటిఫికేషన్ ను విడుదల చేస్తున్నట్టు టీఎస్ఆర్టిసి ఎండీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాన్ ఇంజనీరింగ్ విభాగంలో అప్రెంటీస్ శిక్షణ కోసం బీఏ, బీకామ్, బీసీఏ అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఈ అభ్యర్థులు 2018, 2019, 2020, 2021, 2022 మరియు 2023 విద్య సంవత్సరంలో ఉతీర్ణత కలిగి ఉండాలి.

అయితే ఈ ఉద్యోగానికి వయోపరిమితి 21 నుండి 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. అలా ఉన్నవారు అర్హులుగా ఉంటారు. దీనికి మూడేళ్ళ  శిక్షణ ఉంటుంది. మొదటి సంవత్సరంలో నెలకి రూ.15,000, రెండో సంవత్సరంలో నెలకి రూ.16,000 మరియు మూడవ సంవత్సరంలో నెలకి రూ.17,000 వరకు స్టయిఫండ్ అందుతుంది. కోచింగ్ వాళ్లే ఇచ్చి, ప్రతి నెల స్టయిఫండ్ రూపంలో డబ్బులు కూడా వాళ్లే ఇస్తారు.

tsrtc-rtc-jobs-in-telangana-new-notification-released
Image Credit : Sakshi Education

Also Read : UGC NET Result 2023: త్వరలో UGC NET డిసెంబర్ 2023 పరీక్ష ఫలితాలను విడుదల చేయనున్న NTA; ఫలితాలను ugcnet.nta.ac.inలో తనిఖీ చేయండి.

దీనికి అప్లై చేసుకోడానికి ఫిబ్రవరి 16 చివరి తేదీ. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. https://www.nats.education.gov.in/ వెబ్ పోర్టల్ ని సందర్శించి అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకొని TSRTC ESTABLISHMENT ఎంపిక చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలు పొందడానికి అధికారిక వెబ్సైటు srtc.telangana.in ని సందర్శించండి.

ప్రాంతం వారీగా పోస్టుల సంఖ్య : 

  • హైదరాబాద్ – 26
  • కరీంనగర్ – 15
  • సికింద్రాబాద్ – 18
  • వరంగల్ – 14
  • మహబూబ్ నగర్ – 14
  • నల్గొండ – 12
  • మెదక్ – 12
  • రంగారెడ్డి – 12
  • ఖమ్మం – 09
  • ఆదిలాబాద్ – 09
  • నిజామాబాద్ – 09

ఎంపిక విధానము : 

డాక్యుమెంట్స్, విద్యార్హతలు, రిజర్వేషన్ రూల్, లొకాలిటీ వంటివి ఆధారం చేసుకొని ఎంపిక చేస్తారు.

Comments are closed.