UPSC Notification Release 2024: యూపీఎస్సీ లో ఖాళీ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. వీళ్ళకు దరఖాస్తు ఫీజు లేదు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నుంచి ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ లో మెడికల్ ఆఫీసర్ పోస్ట్ లతో సహా ఇతర ఖాళీలు మొత్తం కలిపి 109 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

UPSC Notification Release 2024: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఖాళీ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది. UPSC లో ఖాలీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ మరియు ఇతర పోస్టులను నింపేందుకు దరఖాస్తులకు ఆహ్వానించింది. యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​ upsc.gov.in ద్వారా అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. సంస్థలోని 109 ఖాళీ పోస్టులను ఈ రిక్రూట్ మెంట్ 2024 డ్రైవ్ ద్వారా UPSC భర్తీ చేయనుంది.

దరఖాస్తులను ఆన్ లైన్ లో నింపేందుకు 2 మే 2024 చివరితేదీగా గుర్తుంచుకోండి. యూపీఎస్సీ ప్రకటించిన ఖాళీ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకునేందుకు కావలసిన అర్హత, ఖాళీ పోస్ట్ ల యొక్క వివరాలు, దరఖాస్తు ఫీజు మరియు ఇతర సమాచారం ఈ క్రింద ఇవ్వబడింది తెలుసుకోండి.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) రిక్రూట్​మెట్​ 2024- వివరాలు.

భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:

సైంటిస్ట్-బి: 3 పోస్టులు

స్పెషలిస్ట్ గ్రేడ్-3 అసిస్టెంట్ ప్రొఫెసర్ : 42 పోస్టులు

ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ -1: 2 పోస్టులు

అసిస్టెంట్ కెమిస్ట్ : 3 పోస్టులు

నాటికల్ సర్వేయర్ కమ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ : 6 పోస్టులు

అసిస్టెంట్ ప్రొఫెసర్ : 13

మెడికల్ ఆఫీసర్ పోస్ట్ లు : 40 పోస్టులు

పైన వివరించిన ఖాళీ పోస్టులకు అర్హత కలిగి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఉండవలసిన విద్యార్హతలు, కావలసిన వయోపరిమితి వివరాలు అన్నీ కూడా తెలుసుకోవడానికి యూపీఎస్సీ ప్రకటనను చూడవలసిన అవసరం ఉంటుంది. నోటిఫికేషన్​ చూసేందుకు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

దరఖాస్తు రుసుము చెల్లించే విధానం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ రిక్రూట్ మెంట్ 2024 : UPSC రిక్రూట్​మెంట్​ ప్రక్రియ 2024 కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు (ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు పొందిన మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ వికలాంగులు మినహా) రూ.25 ఫీజును ఎస్​బీఐ లేదా ఇతర ఏదైనా శాఖలో నగదు రూపంలో లేదా ఏదైనా ఇతర బ్యాంకుల నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని ఉపయోగించడం ద్వారా లేదా వీసా, మాస్టర్, రూపే మరియు క్రెడిట్ కార్డ్ గానీ డెబిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపును ఉపయోగించడం ద్వారా మాత్రమే చెల్లించాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్​సైట్​ని సందర్శించండి. మీకు కావలసిన సమాచారం పూర్తిగా ఉంటుంది.

ఫీజు మినహాయింపు ఎవరికంటే.

దరఖాస్తు రుసుము నుంచి ఈ క్రింది వారికి మినహాయింపు కలిగించారు.
మహిళా అభ్యర్ధులకు
షెడ్యూల్ క్యాస్ట్ వారికి
షెడ్యూల్ తెగల వారికి
దివ్యాంగ అభ్యర్ధులకు.

UPSC Notification Release 2024

 

 

 

 

 

 

 

Comments are closed.