US Raises Visa Fees: ఏప్రిల్ 1నుంచి వీసా ఫీజులు మూడు రెట్లు పెంచనున్న అమెరికా, ఖరీదు కానున్న అమెరికా వెళ్ళాలనే కల.

US Raises Visa Fees: దాదాపు ఎనిమిది ఏళ్ళ తరువాత అమెరికా వీసా ఫీజులలో మార్పు చేస్తుంది. రానున్న రోజుల్లో వీసా సేవలలో కూడా మార్పులు జరుగవచ్చు. రుసుములు పెంచడం అనేది ఎక్కువమంది భారతీయులపైనే ప్రభావం చూపుతుంది. అమెరికా వెళ్ళాలనే కల ఇప్పుడు ఖరీదుగా మారబోతుంది.

US Raises Visa Fees: చాలా మంది అమెరికాకు వెళ్లాలనే కల కలిగి ఉంటారు కానీ ఇప్పుడు అమెరికాకు వెళ్ళాలనే కల కొంచెం ఖరీదైనది కావచ్చు! ఈ వార్త షాకింగ్ గానే ఉంది, అవును, ఏప్రిల్ 1 నుంచి అమెరికా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ఫీజులో భారీ పెంపుదల ఉండబోతోంది. అయితే ఈ వార్తను మనం వివరంగా అర్థం చేసుకుందాం.

మూడింతలు పెరగనున్న వీసా ఫీజులు! దీనివలన ఏ వీసాలు ప్రభావితమవుతాయి?

అమెరికా వెళ్లడానికి చాలా రకాల వీసాలు కావాలి. ఇప్పుడు పెంచుతున్న వీసా ఫీజులు ముఖ్యంగా హెచ్-1బీ, ఎల్-1, ఈబీ-5 వీసాలకు వర్తిస్తాయి. ఈ వీసాలు కలిగిన వారంతా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీ కిందకు వస్తారు. H-1B వీసా విదేశీయులు తమ ప్రతిభను అమెరికన్ కంపెనీలకు పని చేయడానికి అనుమతిస్తుంది. అదేవిధంగా L-1వీసా అనేది కంపెనీలో దేశాన్ని మార్చడం ద్వారా బదిలీ చేయబడిన ఉద్యోగుల కోసం. EB-5 వీసా ద్వారా పెట్టుబడి ఆధారంగా US లో నివసించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది.

ఈ ఫీజు పెంపుదలను దాదాపు ఎనిమిదేళ్ల తరువాత చేస్తున్నారు. చివరిగా 2016లో US వీసా ఫీజు మార్చబడింది. రాబోయే కాలంలో వీసా సేవల్లో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీనితో పాటు, వీసా ఫీజుల పెంపుదల జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఆ దేశ ఇమ్మిగ్రేషన్ విధానం మరియు అంతర్జాతీయ సంబంధాలపై కూడా ప్రభావం చూపవచ్చు.

ఫీజులు ఎంత పెంచుతారు?

H-1B వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటే, ఫారమ్ I-129 అవసరం. దీనికి ప్రస్తుత రుసుము 460 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.38,000), ఇది రూ.64,000(US$780కి) కంటే ఎక్కువ పెరుగుతుంది. దీంతో పాటు H-1B రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా పెరగనున్నాయి. ప్రస్తుతం ఇది US$10 (సుమారు రూ.829), ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1నుండి సుమారు రూ.17,000(అమెరికన్$215)కి పెరుగుతుంది.

ఇప్పుడు L-1 వీసా ఖర్చు పెరుగుదల గురించి తెలుసుకుందాం, L-1వీసా ఇది కూడా వలసేతర వీసా కేటగిరీ లోకి వస్తుంది. కంపెనీలు తమ ఉద్యోగులను ఇతర దేశాలలోని తమ కార్యాలయాల నుండి అమెరికాకు తాత్కాలికంగా బదిలీ చేయడానికి L-1వీసాను ఉపయోగిస్తాయి. ప్రస్తుతం L-1వీసా రుసుము 469 అమెరికన్ డాలర్లు (సుమారు రూ.38,000), కొత్త ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి 1385 US డాలర్లకు (సుమారు రూ.1,10,000) పెరుగుతుంది. అంటే మూడు రెట్లకు పైగా పెరుగుదల!

ఈ ఫీజుల పెంపుదల వలన ముఖ్యంగా భారతీయులను ప్రభావితం చేస్తుంది. అమెరికాలో నివసించేందుకు వెళ్ళే భారతీయుల్లో ఎక్కువ మంది హెచ్‌-1బీ, ఎల్‌-1, ఈబీ-5 వీసాలు వాడుతున్నారు. కనుక ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా వెళ్లాలంటే కాస్త ఖర్చు పెరుగుతుంది.

గమనిక: ఈ సమాచారం డిపార్ట్‌మెంటల్ నోటిఫికేషన్ మరియు వివిధ మీడియా నివేదికల ఆధారంగా ఇవ్వబడింది. అధికారికమైన అప్ డేట్ ల కోసం US అధికారిక ఎంబసీ వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి.

US Raises Visa Fees

 

 

Comments are closed.