Telugu Mirror : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ (Ap Skill Development) అవినీతి కేసులో శనివారం ఏపీ సి ఐ డి (CID) పోలీసులు అరెస్ట్ చేసిన, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడును ఒకరోజు తర్వాత ఆదివారం ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ కోర్టులో హాజరుపరిచారు.
PTI వార్తా సంస్థ ప్రచురించిన నివేదికలో అంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా తోపాటు మరికొంత మంది న్యాయవాదుల బృందం వాదిస్తున్నట్లు పేర్కొంది.కోర్టు కాంప్లెక్స్ వద్ద పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు గుమిగూడారు
Also Read : మీ వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ ఉందా, లేకపోతే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
కుంచనపల్లిలోని సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కార్యాలయంలో 10 గంటల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ రోజు తెల్లవారుఝామున 3:40 గంటలకు చంద్రబాబు నాయుడును వైద్య పరీక్షల నిమత్తం విజయవాడలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.సుమారు 50 నిమిషాల పాటు జరిగిన పరీక్షల తరువాత నేరుగా స్థానిక కోర్టుకు తీసుకెళ్తారని అనుకున్నా ,తిరిగి సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు.
పీటీఐతో టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రాం మాట్లాడుతూ, చంద్రబాబును కోర్టుకు తీసుకెళ్తారని అనుకున్నాం. అయితే తిరిగి సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు అని పేర్కొన్నట్లు పీటీఐ నివేదించింది. కోర్టు వద్ద లోకేష్ (కొడుకు), భువనేశ్వరి (భార్య) వేచి ఉన్నారు, కానీ ప్రభుత్వాసుపత్రి నుంచి కాన్వాయ్ ఒక్కసారిగా సిట్ కార్యాలయం వైపు మళ్లింది.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో జరిగిన కుంభకోణంలో నంద్యాల పట్టణంలోని జ్ఞానపురంలోని ఆర్‌కె ఫంక్షన్ హాల్ వద్ద నుండి శనివారం ఉదయం 6 గంటలకు నాయుడుని అరెస్టు చేసినట్లు రాష్ట్ర పోలీసులు శనివారం ఉదయం ప్రకటించారు. అలాగే నాయుడు అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పలువురు టీడీపీ నేతలను కూడా గృహనిర్బంధంలో ఉంచారు.
Also Read : కొత్త తరం కోసం దూసుకు వచ్చిన TVS RTR 310 స్పోర్ట్స్ బైక్
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సంబంధిత IPC సెక్షన్లు 120B (నేరపూరిత కుట్ర), 420 (మోసం చేయడం మరియు అక్రమంగా డబ్బు పంపిణీని ప్రేరేపించడం) మరియు 465 (ఫోర్జరీ)తో సహా సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేశారు.అదేవిధంగా ఏపీ సీఐడీ ఆయనపై అవినీతి నిరోధక చట్టాన్ని కూడా ప్రయోగించింది.
ఈ కేసులో టీడీపీ అధినేతను ‘ముఖ్య సూత్రధారి’గా పేర్కొంటూ ఈ స్కాం వలన రాష్ట్ర ప్రభుత్వానికి రూ.300 కోట్ల పై చిలుకు నష్టం కలిగించారని ఆరోపణలను సీఐడీ అధికారులు చేశారు.కాగా, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆదివారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకరోజు నిరాహారదీక్షలో పాల్గొనాలని తన మద్దతుదారులకు టీడీపీ పిలుపునిచ్చింది.