Telugu Mirror : ప్రజలు ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్ (Street food) ని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా తినే వంటకాల్లో చోలే భాతురే (Chole Bhature) ఒకటి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఈ చోలే భాతుర్‌ను ఇష్టంగా మరియు ఆనందంగా తింటూ ఉంటారు. అయితే ఈ వంటకాన్ని తినడానికి బయటికి వెళ్లాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఎంతో రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మేము మీకు చెప్పబోతున్నాం. ఈ రెసిపీని మీరు ఇంట్లో ప్రయత్నించి చూడండి.
ఈ రెసిపీకి కావాల్సిన పదార్ధాలు?
1. మైదా పిండి – ఒక నాలుగు కప్పులు
2.సెమోలినా (రవ్వ) – 1/2 కప్పు
3. పెరుగు – ముప్పావు కప్పు
4. పంచదార – ఒక టీస్పూన్
5. వంట సోడా – 3/4 టీస్పూన్
6. నూనె – వేయించడానికి సరిపడా
7. ఉప్పు – రుచికి తగినంత
చిక్పీస్ సిద్ధం చేసుకోడానికి కావలసిన పదార్ధాలు
1. చిక్పీస్ – అర కప్పు
2. టమాటాలు – మీడియం సైజు లో 4 నుండి 5 వరకు
3. అల్లం-వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్
4. జీలకర్ర- అర టీ స్పూన్
5. ధనియాల పొడి – ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్
6. కారం – హాఫ్ టీ స్పూన్
7. ఇంగువ – చిటికెడు
8. మసాలా – పావు టీ స్పూన్
9. పచ్చిమిర్చి – ఒక రెండు లేక మూడు
10. టీ బాగ్స్ – ఒకరెండు
11. కొత్తిమీర – కొద్దిగా
Also Read : తొక్కే కదా అని పారేయకండి, నిమ్మకాయ తొక్కలతో బోలెడు ప్రయోజనాలు
చోలే భాతుర్ తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం..
ముందుగా మైదా పిండిని మరియు సెమోలినాను (Semolina) జల్లెడ పట్టండి. ఒక గిన్నెలో ఈ పిండిని, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ , తగినంత ఉప్పు, వంట సోడా, చెక్కర, పెరుగు వేసి బాగా కలపాలి. దీని తర్వాత గోరు వెచ్చని నీటిని కొద్దీ కొద్దిగా కలుపుతూ ముద్దలా అయ్యేంత వరకు కలపాలి. అలా కలిపిన తర్వాత ఒక రెండు గంటలు వెచ్చగా ఉన్న ప్రదేశంలో ఉంచండి. ఇక ఈలోపు చిక్పిస్ ని తయారు చేసుకోండి. చిక్పిస్ మృదువుగా రావాలంటే చిక్పిస్ (Chickpeas) ని రాత్రి సమయం లో నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ చిక్పిస్లను వేసి కొన్ని నీళ్లు పోసి అందులో బేకింగ్ సోడా , ఉప్పు మరియు టీ బాగ్స్ వేసి ఒక 2 నుండి 3 విసిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి.
Also Read : soya Bean : మీరు ఎప్పుడైనా సోయా ఛాప్స్ తయారీ చూశారా? ఇలా చేస్తారని ఊహించరు! వైరల్ గా మారిన వీడియో
టమాటాలను మరియు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి మిక్సీ జార్ లో వేసి దీనితో పాటు అల్లం పేస్ట్ వేసి గ్రైండ్ చేసి ఒక గిన్నెలో ఆ మిశ్రమాన్నితీసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో నూనె వేసి మీడియం ఫ్లేమ్ లో మంట పెట్టి నూనె వేడయ్యాక జీలకర్ర , ధనియాల పొడి వేసి వేయించాలి. ఇందులో ఇంతకముందు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మిశ్రమాన్ని మరియు కారం వేసి కాసేపు కలుపుతూ ఉండాలి. మసాలా పైన తేలుతూ ఉన్న సమయంలో గ్లాస్ నీరు పోసి మరియు కొద్దిగా ఉప్పు వేసి కలుపుతూ ఉండాలి. దాని తర్వాత, కుక్కర్ ఓపెన్ చేసి అందులో నుండి టీ బాగ్స్ తీసి అందులోని మిశ్రమాన్ని ఇందులో వేసి ఒక 2 మిమిషాల పాటు ఉడికించాలి. దాని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి.
ఇందాక మెత్తగా కలిపిన పిండిని తీసుకొని మరోసారి కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని బాల్స్‌గా తయారు చేసి వేడి నూనెలో డీప్-ఫ్రై (Deep-fry) చేయండి. రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఒక ప్లేట్ లో సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన చోలే భాతురే ఇప్పుడు రెడీ అయింది.