తొక్కే కదా అని పారేయకండి, నిమ్మకాయ తొక్కలతో బోలెడు ప్రయోజనాలు

నిమ్మ తొక్కల్లో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్లు, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి.

Telugu Mirror : నిమ్మకాయ అత్యంత ప్రజాదరణ (popularity) పొందిన ఆహార పదార్ధం, నిమ్మకాయ ని వాడిన తరువాత మనం సాధారణంగా పై తొక్క గురించి అంతగా పట్టించుకోము. అయితే, నిమ్మ తొక్కలో అనేక రకాల బయోయాక్టివ్ (Bioactive)  పదార్థాలు ఉన్నాయని, అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయని మీకు తెలుసా? నిమ్మ తొక్కలో విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్ ఉన్నాయని పరిశోధనలో తేలింది. వాస్తవానికి, నిమ్మ పండు లేదా నిమ్మ రసంలో లేని పోషకాలు నిమ్మ తొక్కలో ఎక్కువగా ఉంటాయన్న విషయం మీకు తెలుసా? నిమ్మకాయలో విటమిన్ సితో పాటు మన ఆరోగ్యానికి కావలిసిన ముఖ్యమైన అంశాలు అధికంగా కలిగి ఉంటాయి. అయితే నిమ్మతొక్క వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా ఇతర ప్రయోజనాలు  కూడా ఉన్నాయి  అవేంటో ఇప్పుడు చూద్దాం.

చీమలను నాశనం చేయండి

మీ వంటగదిలో చీమలు ఎక్కువగా ఉండటం వలన విసుగు చెందుతున్నట్లయితే మీరు నిమ్మ తొక్కలను ఉపయోగించవచ్చు. మీరు చేయాల్సిందల్లా చీమలు ప్రవేశించే ప్రదేశాలు అనగా కిటికీలు, తలుపులు మరియు ఇతర ప్రాంతాల వద్ద నిమ్మ తొక్క ఉంచండి. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల వంటగదిలోకి చీమలు రాకుండా ఉంటాయి.

మరకలను తొలగిస్తుంది
కాఫీ మగ్ నుండి మరకలను వదిలించుకోవడానికి నిమ్మ తొక్కను ఉపయోగించవచ్చు. దీని కోసం, కాఫీ కప్పులో నిమ్మ తొక్క మునిగే వరుకు నీరు పోయాలి. ఒక గంట తర్వాత, శుభ్రంగా ఒక గుడ్డతో మరకలను నిర్ములించవచ్చు.

దంత ఆరోగ్యానికి నిమ్మతొక్క
మీ దంత సంరక్షణ కొరకు కూడా నిమ్మతొక్క చాలా మేలుని కలిగిస్తుంది. ఈ విషయం జపాన్ శాస్త్రవేత్తల పరిశోధనలో కనుగొనబడింది. ఈ అధ్యయనం ప్రకారం, నిమ్మ తొక్కలో ఫ్లోరిన్, 8-జెరానియోక్లిప్సోలారెన్, 5-జెరానియోక్లిప్సోలారెన్, 5-జెరానిలోక్సీ మరియు 7-మెథాక్సికౌమరిన్ వంటి అనేక ముఖ్యమైన రసాయనాలు ఉన్నాయి, ఇవి నోటి బాక్టీరియాను నిర్మూలించడంతో పాటు మళ్ళీ తిరిగి పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

చర్మం కాంతివంతం
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ అనే గుణం ఉండటం వలన సహజ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. సాదారణంగా చర్మ సౌందర్యం కోసం నిమ్మరసాన్ని ఉపయోగిస్తాము, అదే విధంగా నిమ్మతొక్క కూడ చర్మానికి  తేలికగా ఉపయోగించవచ్చు. మీరు కావాలనుకుంటే మీ మడమలు మరియు మోచేతుల చర్మాన్ని శుభ్రపరచడానికి దీన్ని ఉపయోగించవచ్చు. అదే విధంగా నిమ్మ తొక్కను ముందుగా చిన్న ముక్కలుగా చేసి, ఉపయోగించే ముందు ఎండలో ఆరనివ్వాలి. బాగా ఆరిన తర్వాత మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని డ్రై కంటైనర్‌లో నిల్వ ఉంచాలి. ఇప్పుడు ఈ పొడిని ఫేస్ మాస్క్‌గా లేదా లిప్ బామ్‌గా ఉపయోగించవచ్చు.

మైక్రోవేవ్‌ను శుభ్రపరచండి

మైక్రోవేవ్ శుభ్రం చేయడానికి నిమ్మ తొక్కలను, మైక్రోవేవ్ సేఫ్ బౌల్‌లో సగం వరకు నీటితో నింపి తరువాత 5 నిమిషాలు లేదా నీరు మరిగే వరకు వేడి చేయాలి. మరిగే సమయంలో నీటి నుండి ఆవిరి వస్తుంది. కొంత సమయం తరువాత, వేడి నీటి గిన్నెను తీసి, శుభ్రమైన గుడ్డతో మైక్రోవేవ్‌ను శుభ్రం చేయండి. దీంతో మురికి, దుర్వాసన రెండూ పోతాయి.

స్క్రబ్‌గా ఉపయోగించండి

నిమ్మ తొక్కకి చక్కెర మరియు కాఫీ ఉంచండి. దీన్ని స్క్రబ్ లాగా ముఖంపై సున్నితంగా అప్లై చేయాలి. 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. ముఖంతో పాటు, మీరు ఈ స్క్రబ్‌ని చేతులకు మరియు కాళ్ళకు కూడా ఉపయోగించవచ్చు.

రక్తపోటు నియంత్రణ

రాత్రి పడుకునే ముందు నిమ్మకాయ ముక్క లేదా దాని తొక్కను మంచం దగ్గర ఉంచండి. ఇది మీకు ఉదయాన్నే తాజా అనుభూతిని పొందడంలో సహాయపడటమే కాకుండా దాని సువాసన మీ రక్తపోటును చాలా వరకు తగ్గిస్తుంది. అదనంగా, రాత్రిపూట మీతో పాటు నిమ్మకాయ తొక్కను ఉంచుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి కారణాల నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది.

Comments are closed.