CMAT 2024 Exam Application Deadline Extension: కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT) 2024 కు దరఖాస్తు చేసుకునే గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పొడిగించింది. CMAT 2024 కు రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపును NTA అధికారికంగా ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు CMAT 2024 కోసం దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు CMAT పరీక్ష యొక్క అధికారిక వెబ్‌సైట్ nta.ac.in/CMAT ను సందర్శించడం ద్వారా అందులో CMAT పరీక్ష దరఖాస్తును రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ పరీక్షకు గతంలో ప్రకటించిన విధంగా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 19 అని ప్రకటించబడింది. కానీ ఇప్పుడు ఏప్రిల్ 23 రాత్రి 9:50 వరకు దరఖాస్తు చేసుకునే సమయాన్ని పొడిగించాలని NTA ద్వారా నిర్ణయించబడింది. దరఖాస్తుదారులు తమ దరఖాస్తు రుసుమును11.50 PM వరకు డిపాజిట్ చేయవచ్చు. అదేవిధంగా CMAT 2024 పరీక్షను మేలో నిర్వహించాలని నిర్ణయించారు.
మార్చి 29, 2024 నాటి పబ్లిక్ నోటీసును అనుసరించి దానికి కొనసాగింపుగా కామన్ మేనేజ్ మెంట్ అడ్మిషన్ టెస్ట్ (CMAT) 2024 కు ఆన్ లైన్ లో దరఖాస్తును సమర్పించడానికి ముందుగా నిర్ణయించిన చివరి తేదీని పొడిగించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్ణయించింది. ఈ ప్రకటనతో ఔత్సాహిక అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పిస్తుంది, అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్శిటీ నుండి ఏదైనా గ్రూప్ లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు కూడా CMAT 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Age Limit: CMAT పరీక్షకు హాజరు కావడానికి NTA ఎటువంటి వయోపరిమితిని విధించలేదు.
స్టెప్ 1: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్, exams.nta.ac.in/CMATని సందర్శించాలి.
స్టెప్ 2: వెబ్‌పేజీలో రిజిస్ట్రేషన్ లింక్ ను కనుగొని, దానిపై క్లిక్ చేయండి.
స్టెప్ 3: మీ లాగిన్ కు అవసరమైన ఆధారాలను ఇవ్వండి. మరియు మీ అకౌంట్ కు లాగిన్ చేయండి.
స్టెప్ 4: అప్లికేషన్ ని పూర్తి చేయండి. అలాగే అందులో అడిగిన విధానంలో, కొలతల ప్రకారం అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 5: సూచించిన చెల్లింపు ప్రక్రియల ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించండి.
స్టెప్ 6: ఫీజు చెల్లింపు పూర్తయిన తర్వాత, పూర్తి చేసిన అన్ని వివరాలను క్రాస్ చెక్ మళ్ళొకసారి చెక్ చేసుకుని, సబ్మిట్ బటన్‌ను నొక్కండి.
స్టెప్ 7: ధృవీకరణ ఫారమ్‌ను సేవ్ చేసి, భవిష్యత్ అవసరాలకోసం పూర్తిచేసిన దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొండి.
జనరల్ కేటగిరీ పురుష అభ్యర్థులు రూ. 2,000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. అలాగే మహిళా దరఖాస్తు దారులు రిజిస్ట్రేషన్ సమయంలో రూ. 1,000 రుసుము చెల్లించాలి. అయితే, SC, ST, OBC-NCL, PwD, EWS మరియు థర్డ్-జెండర్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు అందరు కూడా పరీక్ష రుసుముగా రూ.1,000 చెల్లించాలి.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…