Telugu Mirror : కన్నడ సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరు సినీ రంగానికి ప్రత్యేకమైన సహకారం అందించారు. అలాంటి కుటుంబాలలో సర్జా కుటుంబం ఒకటి అని చెప్పవచ్చు. శక్తిప్రసాద్, అర్జున్ సర్జా నుండి మరియు చిరు సర్జా నుండి ధృవ సర్జా వరకు అంటే సర్జా కుటుంబంలోని ప్రతి సభ్యుడు కన్నడ చలనచిత్ర చరిత్రకు ప్రత్యేకమైన కృషి చేశారు.
Also Read : వానా కాలం కుండీలలో ఉన్న మొక్కలకు తీసుకోవలసిన జాగ్రత్తలు.
లాక్ డౌన్ సమయంలో, చిరు సర్జా (chiru sarja)గుండె సంబంధిత సమస్యల కారణంగా ప్రమాదవశాత్తు తన కుటుంబానికి విషాదాన్ని మిగిల్చిన విషయం అందరికీ తెలుసు. ఛాతిలో విపరీతమైన నొప్పి ఉన్నందువల్ల ఆసుపత్రికి తరలించారు. డాక్టర్స్ ఎంత ప్రయత్నించిన చిరు సర్జనీ కాపాడలేకపోయారు. కేవలం 39 ఏళ్లకే మరణించి అందరి మనస్సులో తీవ్రమైన బాధను మిగిల్చి వెళ్లారు. కన్నడ లో చిరు సర్జ ఎంతగానో ప్రజాదరణ పొంది ఎందరి మనసులనో దోచుకున్న వ్యక్తి.
చిరు సర్జ భార్య అయిన మేఘనా రాజ్ మరియు తమ్ముడు ధృవ సర్జా కుటుంబాలల్లో మరియు వారి జీవితాల్లో ఇది ఒక తీరని లోటు మరియు వారిని కుంగదీసిన విషాదం. చిన్న వయసులో చిరు సర్జా అకాల మరణం చెందడం కన్నడ చిత్ర పరిశ్రమకు కూడా పట్టలేని బాధ ని మిగిల్చారు. ఈ విషాదం అతని కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను కుంగదీయడమే కాకుండా, ప్రేక్షకులకు కూడా తీరని శోదను మిగిల్చింది.
Also Read : చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవినీతి కేసులో ఏపీ మాజీ సీఏం అరెస్ట్, కోర్టులో ప్రవేశ పెట్టిన ఏపీ సీఐడీ
ఇది ఇలా ఉండగా ధృవ సర్జా ( Druva sarja) తన అన్నయ్య సమాధి దగ్గర నిద్రిస్తున్న వీడియో ఇటీవల వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో బాగా వైరల్ అయింది. ధృవ సర్జాకి తన అన్నపై ఉన్న ప్రేమ, గౌరవం మరియు వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం యొక్క లోతైన భావాలను ఈ వీడియో ద్వారా అర్ధం అవుతుంది.
ధృవ సర్జా సమాధి పక్కనే ఎందుకు విశ్రాంతి తీసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రశ్నకు ఈరోజు సింపుల్ గా ఒక సమాధానం అయితే బయటికి వచ్చింది. తన అన్నపై ఉన్న అభిమానానికి గుర్తుగా, ధృవ తన ఫామ్ హౌస్ లో సర్జా కోసం సమాధిని నిర్మించాడు. అదే కారణంతో, ధృవ సర్జా తన ఇంటి ప్రాంగణంలో ఉన్న సమాధి వద్ద తరచుగా నిద్రపోతాడు. అయితే, అభిమానులు తమకు తెలియకుండానే ఈ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తత్ఫలితంగా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి దాని గురించి తెలుసు అని చెప్పవచ్చు. వైరల్ అయిన ఈ వీడియోని చూసి అందరూ కంటతడి పెట్టుకున్నారు.
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…