ఉదయం లేచిన వెంటనే టీ (Tea) లేదా కాఫీ (Coffee) తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. టీ ని రోజు మొత్తంలో ఒకటి లేదా రెండుసార్లు కంటే మించి తీసుకోకూడదు. టీ ని ఎక్కువసార్లు త్రాగటం వలన ఆరోగ్యానికి (Health) అంత మంచిది కాదు. అయితే టీ తాగాలి అనుకున్న వారు దీనిని తయారు చేసిన వెంటనే తాగితే ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు. కానీ ఒకసారి చేసిన టీ ని పదేపదే వేడి చేయడం మరియు దానిని తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు (Doctors) చెబుతున్నారు.
గతంలో టీ మరియు కాఫీలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు బ్లాక్ టీ (Black Tea), గ్రీన్ టీ (Green Tea), లెమన్ టీ (Lemon Tea) ఇలా రకరకాల టీ లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఏ రకమైన టీ అయినా, అప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకుని తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది.
Also Read : Tea Effect on children : మీ పిల్లలు ‘టీ’ తాగుతున్నారా? అయితే ఈ సంఘటన గురించి మీకు తెలియాల్సిందే..
కొందరు టీ ని ఉదయం (Morning) తయారుచేసి సాయంత్రం (Evening) వరకు అదే టీ ని మళ్ళీ మళ్ళీ మరగ పెట్టి తాగుతుంటారు. ఇలా చేసిన టీ ని అసలు త్రాగ కూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఎక్కువసార్లు మరిగించిన టీ ని త్రాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలు గురించి తెలుసుకుందాం.
చల్లారిన టీ (Cold Tea) ని మళ్లీమళ్లీ వేడి చేసి త్రాగడం వలన శరీరానికి హాని కలిగిస్తుంది. ఒకసారి టీ ని తయారు చేశాక మూడు నుంచి నాలుగు గంటల తర్వాత మళ్ళీ వేడి చేసి త్రాగడం వల్ల ఆరోగ్యం పై చెడు ప్రభావం (Side Effects) చూపిస్తుంది.
మొదట టీ చేసినప్పుడు ఉన్నంత రుచిగా మరియు తాజాగా ఆ తర్వాత ఉండదు. అందులో ఉన్న పోషకాలు నశిస్తాయి.
టీ లో, పాల (Milk) ను ఉపయోగిస్తాం కాబట్టి ఇటువంటి టీ లో బ్యాక్టీరియా (Bacteria) ఉంటుంది. వేడి చేసిన ప్రతిసారి బ్యాక్టీరియా శరీరంలో (Body) కి ప్రవేశిస్తుంది.
వేడి చేసిన తర్వాత మళ్ళీ చల్లగా (Cool) అయ్యేవరకు ఉంచి తాగకూడదు. 15 నిమిషాల తర్వాత ఒకసారి మాత్రమే వేడి చేయవచ్చు. అంతే కానీ మూడు లేదా నాలుగు గంటల తర్వాత అదే టీ ని వేడి చేసి త్రాగినట్లయితే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
Also Read : Effects of Tea : మీరు ‘టీ’ తాగుతున్నారా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే ..
చల్లగా అయిన టీ ని పదేపదే వేడి చేసే తాగడం వల్ల గ్యాస్ (Gas) సమస్యలు, గుండెల్లో మంట, వాంతులు, కడుపునొప్పి, విరోచనాలు వంటివి వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.
కాబట్టి టీ త్రాగాలి అనుకుంటే తాజా (Fresh) గా అప్పుడే తయారుచేసుకున్న టీ ని మాత్రమే త్రాగాలి. అలాగే ఎంత అవసరమో అంత టీ ని మాత్రమే తయారు చేసుకోవాలి.ఎక్కువ టీ తయారుచేసి దానిని సాయంత్రం వరకు ఉంచి అదే టీ ని పదేపదే వేడి చేసి త్రాగడం ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదు.