ఎలక్షన్ షెడ్యూల్ విడుదల :
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం మరియు ఛత్తీస్‌గఢ్‌లలో ఎన్నికలను నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ సిద్దమైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం లలో ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.
తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ తేదీలు 2023 :
నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ప్రకటించింది. ఓట్ల లెక్కింపు మాత్రం డిసెంబర్ 3 న జరగనుంది. తెలంగాణ లోని నియోజక వర్గాలు మొత్తం 119. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు అందులో 1.58 కోట్ల మంది పురుష ఓటర్లు, 1.58 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు’’ అని EC తెలిపింది. జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలలో 18-19 సంవత్సరాల మధ్య మొదటిసారి ఓటు వచ్చిన 60 లక్షల మంది యువత ఓటింగ్ లో పాల్గొంటారు. యువ ఓటర్లను ప్రేరేపించడానికి, 2900 పోలింగ్ స్టేషన్‌లను యువత చేత నిర్వహిస్తున్నట్లు EC తెలిపింది. తెలంగాణలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 8.11 లక్షలు.
Also Read : ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్, వరల్డ్ కప్‌లో టీమిండియా బోణీ
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికార, భారత రాష్ట్ర సమితి, బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ జరగనుంది. 2018లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలలో, BRS (అప్పటి TRS పార్టీ) 119 సీట్లలో 88 సీట్లు గెలుచుకుంది మరియు 47.4% ఓట్ల షేర్ ను పొందింది. 19 సీట్లతో 28.7% ఓట్ల వాటాను పొంది కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే ముందు పరిశీలకుల సమావేశాన్ని అక్టోబర్ 6న ఎన్నికల సంఘం నిర్వహించింది, రాబోయే ఎన్నికలలో ధన ప్రవాహ ముప్పును పూర్తిగా నియంత్రించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పరిశీలకులను కోరారు. ఈ సమావేశంలో మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ శాసనసభల పదవీకాలం 2024 జనవరిలో ముగుస్తుండగా, మిజోరం లో మాత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో శాసనసభ పదవీకాలం ముగుస్తుంది. 2024 ఏప్రిల్-మేలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు నెలరోజుల ముందు ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న సందర్భంలో ఈ ఎన్నికలు చాలా కీలకం. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్, బీజేపీలు కీలకంగా వ్యవహరిస్తుండగా. తెలంగాణలో అధికార భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొనే అవకాశం ఉంది.
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ :
సగటున 897 మంది ఓటర్లకు ఒక పోలింగ్ బూత్ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
సరిగ్గా 50 రోజులలో ప్రజాభిమానం పొందే పార్టీ ఏదో కాలమే డిసైడ్ చేస్తుంది.
Also Read : ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ ను మార్చుకోవాలా, అయితే ఇలా ఈజీగా మార్చుకోండి
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…