AP 10th Results 2024 Useful News: ఏపీ పదో తరగతి ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల. ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.

AP 10th Results 2024 Update : ఆంధ్రప్రదేశ్ లో గత నెల ముగిసిన పదవ తరగతి పరీక్షల ఫలితాలను సోమవారం విజయవాడలో ప్రకటించనున్నారు. 6 లక్షల మందికి పైగా విధ్యార్ధుల భవిష్యత్ ను నిర్ణయించే ఈ ఫలితాలు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కమిషనర్ విడుదల చేయనున్నారు.

AP 10th Results 2024 Useful News: 6లక్షలమందికి పైగా విద్యార్ధులు మరియు వారి తల్లిదండ్రుల ఎదురు చూపులు, ఉత్కంఠకు ఈ రోజు తెరపడనుంది. ఏపీ లో ఈరోజు ఉదయం 11గంటలకు పదవ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి.

విజయవాడలో సోమవారం ఉదయం 11గంటలకు విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల ప్రకటనకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే సిద్దం చేసినారు. ఈ విద్యాసంవత్సరంలో 6లక్షల మందికి పైగా పదవ తరగతి విద్యార్ధులు పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.

Results On AP SSC Board Site :

AP 10th Results 2024
Image Credit : Telugu Mirror

పదో తరగతి పరీక్ష రాసి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులు ఏపీ SSC బోర్డ్ వెబ్ సైట్ https://www.bse.ap.gov.in/ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. విద్యార్ధులు ఈ లింక్ పైన డైరెక్ట్ గా క్లిక్ చేసి వెబ్ సైట్ లోకి వెళ్ళి రూల్ నంబర్ ను ఎంటర్ చేసి ‘Check Result’ పైన క్లిక్ చేస్తే క్షణాలలో మీ ఫలితాన్ని స్క్రీన్ మీద చూపిస్తుంది. ప్రింట్ ఆప్షన్ బటన్ మీద నొక్కితే ఫలితాల కాపీని పొందవచ్చు.

ఈ సంవత్సరం జరిగిన పదవ తరగతి ఫలితాల కోసం 6,23,092 మంది రెగ్యులర్ విద్యార్ధులు పరీక్షకు హాజరయినారు. వారిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు.

గత సంవత్సరం (2023) ఏపీ లో పదవ తరగతి ఫలితాలు మే 6వ తారీఖున విడుదల చేశారు. గత ఏడాది తో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా ముందుగానే ఫలితాలు విడుదల అవుతున్నాయి. అదే విధంగా పోయిన సంవత్సరం షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 18తో పదవ తరగతి పరీక్షలు పూర్తి చేసుకుని ఫలితాలని మే 6న ప్రకటించారు. కానీ ఈ విద్యాసంవత్సరంలో పరీక్షలు మార్చి 30వ తేదీన ముగిశాయి. ఫలితాలను తొందరగా ప్రకటిస్తున్నారు.

ఈ ఏడాది మార్చి 30న పదవ తరగతి పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ 1నుంచి ఏప్రిల్ 8వ తారీఖు వరకు జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగింది. రాష్ట్ర వ్యాపితంగా పలు జిల్లా కేంద్రాలలో స్పాట్ వ్యాల్యూయేషన్ ప్రక్రియ నిర్వహించారు. ఎలాంటి పొరపాట్లు తలెత్తకుండా ఈ మూల్యాంకన ప్రక్రియను నిర్వహించారు అధికారులు. షుమారు 25వేల మందికి పైగా సిబ్బంది స్పాట్ వ్యాల్యుయేషన్ లో పాల్గొన్నారు.

ఏపీ లో ఈ ఏడాది మొత్తం 6.54 లక్షల మంది విద్యార్ధులు పరీక్ష ఫీజు చెల్లించినారు. కానీ ఇందులో 6.23 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రైవేట్ గా పరీక్షలకు 1.02 లక్షల మంది పరీక్ష రాశారు.

సోమవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్న ఏపీ పదవ తరగతి ఫలితాలను ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయడం ద్వారా క్షణాలలో రిజల్ట్ ని తెలుసుకోండి.

www.results.bse.ap.gov.in

bse.ap.gov.in

ఇదిలావుండగా మరో పక్క తెలంగాణలో జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాలు త్వరలోనే విడుదల అవనున్నాయి.

AP 10th Results 2024

Comments are closed.