KVS Class 1 Admissions 2024-25 : కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతికి అడ్మిషన్లు ప్రారంభం, వివరాలు ఇవే!

కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో ఒకటో తరగతి చదివేందుకు అడ్మిషన్ల ప్రక్రియ, విద్యార్థులకు ఉండాల్సిన అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వంటి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

KVS Class 1 Admissions 2024-25 : కేంద్రీయ విద్యాలయాల్లో మీ  పిల్లలను చదివించాలని ఆలోచిస్తున్నారా? అయితే, కేంద్రీయ విద్యాలయ్ సంఘట్ కేంద్ర ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో ఒకటో తరగతికి అడ్మిషన్లు తీసుకునేందుకు ప్రకటనను విడుదల చేసింది. మరి కేంద్రీయ విద్యాలయ స్కూళ్లలో ఒకటో తరగతి చదివేందుకు అడ్మిషన్ల ప్రక్రియ, విద్యార్థులకు ఉండాల్సిన అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ వంటి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ 2024-25 విద్య సంవత్సరానికి ఒకటో తరగతి చదివే పిల్లలకు అడ్మిషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ విద్యాలయాల్లో చదవాలనుకునే పిల్లలు అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు. దీని కోసం దరఖాస్తు చేసుకునేందుకు అధికారిక వెబ్సైటు అయిన http://kvsonlineadmission.kvs.gov.in కి వెళ్లాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం మర్చి 27 నుండి అంబాటులో ఉంటుంది.

 

KVS Class 1 Admissions 2024-25

దేశవ్యాప్తంగా మొత్తం 1247 కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో లక్షల్లో పిల్లలు అనుభవంతో కూడిన టీచర్ల ద్వారా ఉత్తమ విద్యను పొందుతున్నారు. ప్రతి ఏటా విద్య మంత్రిత్వ శాఖ ఒకటవ తరగతి నుండి 9వ తరగతి వరకు కేవీల్లో అడ్మిషన్లు తీసుకుంటుంది. ఎవరైతే విద్యార్థులు ఈ పాఠశాలల్లో తమ విద్యను కొనసాగించాలి అనుకుంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఇలా దరఖాస్తు చేసుకున్న వారు ఏప్రిల్ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆ తర్వాత మేలో ఫలితాలు వెలువడనున్నాయి. ఆ తర్వాత, రిజర్వ్ చేయబడిన మరియు అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుంది. KVలలో ప్రవేశించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా భారతీయులై ఉండాలి. మీకు కనీసం ఆరు సంవత్సరాల వయస్సు ఉండాలి. ప్రవేశానికి సమర్పించిన అన్ని పత్రాలు తప్పనిసరిగా అసలైనవిగా ఉండాలి.

అడ్మిషన్ పొందేందుకు అర్హతలు..

  • కేవీల్లో చేరాలనుకునే విద్యార్థులు భారతీయులై ఉండాలి.
  • కనీసం ఆరేళ్ళ వయస్సు ఉండాలి.
  • అడ్మిషన్ల కోసం ఇచ్చే డాకుమెంట్స్ ఒరిజినల్ అయి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే విధానం.. 

KVలలో ఫస్ట్-క్లాస్ అడ్మిషన్ కోరుకునే అభ్యర్థులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

  • అధికారిక వెబ్‌సైట్ http://kvsonlineadmission.kvs.gov.in ని సందర్శించాలి.
  • అక్కడ న్యూ రిజిస్టర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • మీ మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేసి, ఆపై రిజిస్టర్ ఎంపికను ఎంచుకోండి.
  • ఆ తర్వాత తగిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్‌ను ప్రివ్యూ చేసి, ఆపై సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి.
  • దరఖాస్తు ఫారమ్ తదుపరి సూచన కోసం సేవ్ చేసుకోండి.

Comments are closed.