Latest Exam Schedule Released: తెలంగాణ ఈసెట్‌, ఐసెట్‌ షెడ్యూళ్లు విడుదల, సంబంధిత ముఖ్య తేదీలు ఏంటో తెలుసుకుందాం

Latest Exam Schedule Released: ఈసెట్‌, ఐసెట్‌ షెడ్యూళ్లు విడుదల అయింది. టీఎస్‌ ఐసెట్‌, టీఎస్‌ ఈసెట్‌, లాసెట్‌, పీజీ లాసెట్‌ పరీక్ష తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.

Latest Exam Schedule Released: విద్యార్థులు ఉన్నత చదువులు చదవటానికి నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. టీఎస్‌ ఐసెట్‌, టీఎస్‌ ఈసెట్‌, లాసెట్‌, పీజీ లాసెట్‌ పరీక్ష తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఆ షెడ్యూల్ ప్రకారం. బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం డిప్లోమా, బీఎస్సీ మ్యాథ్స్‌ అభ్యర్థులకు నిర్వహించే టీఎస్‌ ఈసెట్‌-2024 పరీక్షకు సంబంధించి ఈనెల 14న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 16 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 లేట్ ఫీజుతో ఏప్రిల్‌ 22 వరకు, రూ.1000 లేట్ ఫీజుతో ఏప్రిల్‌ 28 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎంల ద్వారా న్యాయ విద్యను అభ్యసించాలనుకునే వారికోసం మూడేళ్ల, ఐదేళ్ల లా కామన్‌, పీజీ లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ప్రవేశపరీక్షలకు సంబంధించి ఫిబ్రవరి 28న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలకు మార్చి 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు.

Latest Exam Schedule Released

2024–25కు సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు గాను మార్చి 5వ తేదీన టీఎస్‌ ఐసెట్‌ 2024 (TS ICET) నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 7వ తేదీ నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అనంతరం జూన్‌ 4, 5 తేదీల్లో ఐసెట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు.

యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణ బాధ్యతలను తెలంగాణ ఉన్నత విద్యామండలి వివిధ యూనివర్సిటీలకు అప్పగించిన విషయం తెలిసిందే. అలాగే ప్రవేశ పరీక్షలకు కన్వీనర్లను సైతం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఉన్నత విద్యామండలి జనవరి 6నే విడుదల చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ ఈసెట్‌, లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ను నిర్వహించనుంది. ఎడ్‌సెట్‌ను మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఐసెట్‌ను కాకతీయ యూనివర్సిటీ, పీఈసెట్‌ను శాతవాహన యూనివర్సిటీ నిర్వహించనున్నాయి. ఎంసెట్‌, పీజీఈసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూహెచ్‌కు అప్పగించారు. ఎంసెట్‌ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ బీ. కుమార్‌, పీజీఈసెట్‌ కన్వీనర్‌గా ప్రొఫెసర్‌ రవీంద్రరెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే..

Comments are closed.