Summer Holidays 2024, useful news : విద్యార్థులకు శుభవార్త, వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి

తెలంగాణలో పాఠశాలలకు ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు వేసవి సెలవులు కొనసాగుతాయి, మరుసటి రోజు అంటే జూన్ 12న ప్రారంభమవుతాయి.

Summer Holidays 2024 : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. దీనితో పాఠశాలలకు ఒంటి పూట బడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 15న ఒంటి బడులు ప్రారంభమై ఏప్రిల్ 23తో ముగుస్తుంది. తెలంగాణలో పాఠశాలలకు ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు వేసవి సెలవులు కొనసాగుతాయి, మరుసటి రోజు అంటే జూన్ 12న ప్రారంభమవుతాయి.

జూన్ 12 న ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. వేసవి సెలవుల కోసం ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని విద్యా శాఖ పేర్కొంది. ప్రభుత్వం ఇటీవల 1 నుండి 9 తరగతులకు SA2 పరీక్షలను వాయిదా వేసింది. ఇది ఏప్రిల్ 15న ప్రారంభమయి, పరీక్షలు ఏప్రిల్ 22న ముగుస్తాయి.

పరీక్ష సమయాలు 

1వ తరగతి నుంచి 7వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 11.45 గంటల వరకు,8, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. వాటి ఫలితాలు, 23న విడుదల చేసి, అదే రోజు పేరెంట్స్ మీటింగ్ జరగనుంది. ఇలా తెలంగాణలో 45 రోజులకు పైగా వేసవి సెలవులు రాబోతున్నాయి. ఎండ తీవ్రత కొనసాగితే, ఈ వేసవి సెలవులు మరి కొన్ని రోజులు పొడిగించవచ్చు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

AP పాఠశాలలకు వేసవి సెలవులు ఏప్రిల్ 24న ప్రారంభమవుతాయి. అయితే, ఈ వేసవి సెలవులను జూన్ 13, 2024 వరకు పొడిగించే అవకాశం ఉంది. అంటే ఈ సంవత్సరం పాఠశాలలకు దాదాపు 50 రోజుల వేసవి సెలవులు ఉంటాయి.

Summer Holidays 2024

గత ఏడాది తెలంగాణ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులను ఇచ్చారు. గత సంవత్సరం, ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలకు మే 1 నుండి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇచ్చారు. ఈ సంవత్సరం తో పోలిస్తే గతేడాది తక్కువ సెలవులు ఇచ్చారు. జూన్ 12 వరకు సెలవులు..!

ఎగ్జామ్స్ అయిపోగానే వేసవి సెలవులు

యాన్వల్ ఎగ్జామ్స్ అయిపోగానే పిల్లలందరికీ వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుండి జూన్ 12 వరకు ప్రకటించారు. అంటే మళ్ళీ జూన్ 12 వ తేదీన పాఠశాలలు రీఓపెన్ అవుతాయి. మొత్తం దాదాపు 50 రోజుల వరకు సెలవులు ఉన్నాయి. ప్రతి సంవత్సరంలాగానే ఈసారి కూడా సెలవులు అలాగే ఉన్నాయి.

రోజు రోజుకి పెరుగుతున్న ఎండలు

ఎండలు, వేడి గాలులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలకు సెలవులు ఇవ్వగానే తల్లిదండ్రులు పిల్లలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. వేసవిలో తగిన జాగ్రత్తలు పాటించండి.

Summer Holidays 2024

Comments are closed.