TS EAMCET 2024 Details : టీఎస్ ఎంసెట్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఎప్పుడో తెలుసా? దరఖాస్తు చేసుకునే విధానం మీ కోసం

TS ఎంసెట్ పరీక్ష రాయడానికి రిజిస్ట్రేషన్ చివరి తేదీ  ఏప్రిల్ 6, 2024. అధికారిక సమాచారం ప్రకారం, TS EAPCET పరీక్ష 2024 మే 9 మరియు మే 12, 2024 మధ్య జరుగుతుంది.

TS EAMCET 2024 Details :  తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ TS EAMCET 2024 ప్రకటనను విడుదల చేసింది. అధికారిక సమాచారం ప్రకారం, TS EAMCET పరీక్ష 2024 మే 9 మరియు మే 12, 2024 మధ్య జరుగుతుంది. TS EAMCET 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 26, 2024న ప్రారంభమవుతుందని, గడువు ఏప్రిల్ 6, 2024 వరకు ఉంటుందని భావిస్తున్నారు.

TS EAMCET 2024 రిజిస్ట్రేషన్ గడువు గురించి తెలుసుకోబోతున్నాం. TS ఎంసెట్ పరీక్ష రాయడానికి రిజిస్ట్రేషన్ చివరి తేదీ  ఏప్రిల్ 6, 2024.. కాబట్టి, ఎగ్జామ్ రాయాలనుకునే వారు ఆ రోజులోపు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం ఏప్రిల్ 14 వరకు రూ.500 రుసుముని చెల్లించాల్సి ఉంటుంది, ఏప్రిల్ 19 నుండి మే 3 వరకు రూ.2500 మరియు మే 4, 2024 తర్వాత రూ.5000 ఆలస్య రుసుము విధించబడుతుందని కాబట్టి ఇది గమనించి మీ రుసుముని చెల్లించండి.

TS EAMCET 2024 Details

Registration Fee Up To April 14 500 R.s
Registration Fee Up To April 19 2500 R.s
Registration Fee Up To May 4 5000 R.s

TS EAMCET 2024 నమోదు గడువు

జవహర్‌లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్శిటీ (JNTU), హైదరాబాద్ TS EAMCET 2024 పరీక్షను నిర్వహిస్తుంది. నోటిఫికేషన్ ఫిబ్రవరి 21, 2024న విడుదల చేయడం జరిగింది. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 6, 2024. పరీక్ష మే 9-11, 2024 నుండి మే 12-14, 2024 వరకు నిర్వహించబడుతుంది.

పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మూడు గంటల వ్యవధితో ఉంటుంది. పరీక్ష షిఫ్ట్‌లు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు మరియు మధ్యాహ్నం 3:00 నుండి సాయంత్రం 6:00 వరకు ఉంటాయి. పరీక్ష ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.

CBT EXAM TIMINGS MORNING 9:00 TO AFTERNOON 12:00

AFTERNOON 3:00 TO EVENING 6:00

EXAM LANGUAGES ENGLISH, TELUGU, URDU

దరఖాస్తు రుసుము జనరల్ కేటగిరీకి ఒక్కో పేపర్‌కు రూ.800 మరియు SC/ST/PH దరఖాస్తుదారులకు రూ.400. అర్హత ప్రమాణాలు ఇంటర్మీడియట్, మరియు పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్/బయాలజీ నుండి 160 బహుళ-ఎంపిక ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పుడు సమాధానానికి ఎటువంటి నెగటివ్ మార్క్స్ లేవు. సరైన సమాధానానికి ఒక మార్క్ ఇస్తారు.

దరఖాస్తులు అధికారిక వెబ్‌సైట్లో https://eamcet.tsche.ac.in/ ఫిబ్రవరి 26, 2024 నుండి ప్రారంభమై ఏప్రిల్ 6, 2024తో ముగియబడతాయి. ఆలస్యంగా నమోదు చేసుకోవడానికి గడువు మే 4, 2024, అయితే సవరించడానికి చేసుకోవడానికి ఏప్రిల్ 8 నుండి 12, 2024. ఇంజినీరింగ్ పరీక్ష మే 9-10, 2024, వ్యవసాయం మరియు ఫార్మసీ పరీక్షలు మే 11-12, 2024న నిర్వహించబడతాయి.

TS EAMCET పరీక్ష 2024కి ఎలా దరఖాస్తు చేయాలి

TS EAMCET పరీక్ష 2024 కోసం నమోదు చేసుకోవడానికి, ఈ దశలను అనుసరించండి..

  • ముందుగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • హోమ్ పేజీకి వెళ్లిన తర్వాత, పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
  • లాగిన్ అయిన తర్వాత, కొత్త పేజీ కనిపిస్తుంది, అవసరమైన మొత్తం సమాచారాన్ని పూరించమని అడుగుతుంది.
  • నమోదు చేసుకోవడానికి, మీరు తప్పనిసరిగా మీ పేరు, సంప్రదింపు నంబర్ మరియు ఇమెయిల్ చిరునామా వంటి అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించాలి.
  • ఆ తర్వాత, ‘సబ్మిట్’ బటన్‌పై క్లిక్ చేయండి.
  • సబ్మిట్ చేశాక, అన్ని సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • అప్‌లోడ్ చేసిన తర్వాత, మీరు మీ దరఖాస్తు రుసుమును చెల్లించాలి.
  • మీరు ఇచ్చిన సమాచారం సరైనదేనా లేదా తప్పులు ఏమైనా ఉన్నాయా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి.
  • చివరగా, ప్రింట్ చేయండి, తద్వారా మీరు అడ్మిట్ కార్డ్‌ని తర్వాత సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Comments are closed.