TS Model School Admissions 2024, useful news : తెలంగాణ మోడల్ స్కూల్స్ లో ప్రవేశాలు ఎప్పుడో తెలుసా? పూర్తి వివరాలు ఇవే?

తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్‌లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 7వ తేదీన జరిగింది. ప్రవేశాలు ఎప్పటినుండి అంటే..

TS Model School Admissions 2024 : తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్‌లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 7వ తేదీన జరిగింది. రాష్ట్రంలో 81.80 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరైనట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాల ఆధారంగా ఆరు నుంచి తొమ్మిది తరగతులకు ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది 62,982 మంది విద్యార్థులు ప్రవేశానికి దరఖాస్తు చేసుకోగా, 51,525 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణ మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ఆబ్జెక్టివ్‌ టైపు జరిగింది. మొత్తం 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు 100 మార్కులు కలిగి ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షకి రెండు గంటల సమయం ఉంటుంది మరియు ఈ పరీక్ష తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో రాయొచ్చు.

తెలంగాణ మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్-2024

తెలంగాణ మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ఫలితాలు మే 25న వెల్లడికానున్నాయి. ఫలితాల ప్రకటన అనంతరం మే 27 నుంచి మే 31 మధ్య అడ్మిషన్లు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఇంగ్లిష్ మీడియంలో ఆరో తరగతిలో ప్రవేశం ఉంటుంది.

ముఖ్య సమాచారం:

తెలంగాణ మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 రిజర్వేషన్ : ప్రతి తరగతిలో, సాధారణ విద్యార్థులకు 50% సీట్లు, 29 శాతం సీట్లు BCలకు, 15% SCలకు మరియు 6% ST విద్యార్థులకు కేటాయిస్తారు.

అర్హత : అడ్మిషన్ కోరుకునే విద్యార్థి 2023-24 విద్యా సంవత్సరానికి దిగువ జాబితా చేయబడిన తరగతిలో నమోదు చేయబడాలి.

వయోపరిమితి: ఆరవ తరగతికి 10 సంవత్సరాలు. ఏడవ తరగతి పదకొండేళ్లు ఉంటుంది. ఎనిమిదో తరగతికి, మీకు పన్నెండేళ్లు ఉండాలి. తొమ్మిదో తరగతికి 13 ఏళ్లు నిండి ఉండాలి.

వయోపరిమితి : ఆగస్టు 31, 2024 నాటికి 10వ తరగతికి 14 సంవత్సరాలు. ఎంట్రన్స్ టెస్ట్ మరియు రిజర్వేషన్ రూల్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

పరీక్ష విధానం : ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు విలువ ఉంటుంది. పరీక్ష రెండు గంటలు ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లీషు, తెలుగులో ఉంటుంది.

పరీక్ష రుసుము : BC/SC/ST/PH/EWS అభ్యర్థులకు రూ.125 చెల్లించాలి ఇతరులు రూ.200 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి.

TS Model School Admissions 2024

 

 

Comments are closed.