Brahmamudi Serial feb 17th episode : రాజ్ ప్రేమ దక్కించుకునేందుకు కావ్య వేసిన మొదటి మెట్టు, మరి ఆ ప్లాన్ ఫలిస్తుందా?

బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో, కావ్య రాజ్ కి సర్ప్రైజ్ ఇస్తుంది అని చెబుతుంది. ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలని రాజ్ ఆతృతగా ఎదురు చూస్తాడు.

Brahmamudi Serial feb 16th episode : బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్ లో, కావ్య రాజ్ కి సర్ప్రైజ్ ఇస్తుంది అని చెబుతుంది. ఆ సర్ప్రైజ్ ఏంటో తెలుసుకోవాలని రాజ్ ఆతృతగా ఎదురు చూస్తాడు. కావ్య చెవిలో దూది పెట్టుకొని ప్రశాంతంగా పడుకుంటుంది. మళ్ళీ కావ్యని లేపి, ఆ సర్ప్రైజ్ ఏంటి అని అడుగుతాడు. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ యే అంటి కావ్య అంటుంది.

కళ్యాణ్ అనామిక దగ్గరికి వచ్చి ఈరోజు టీ, టిఫిన్స్ ఏమి లేవా అని అడుగుతాడు. నువ్వు చెప్పినట్టే ఆఫీసుకు వెళ్తున్నా కదా అని అడుగుతాడు. కానీ అనామిక ఇప్పుడు అలాంటివి ఏమి లేవు అని అడుగుతుంది. నువ్వు ఆఫీసుకి వెళ్ళావ్ కదా అక్కడ ఏం పని చేసావ్ అని అనామిక అడుగుతుంది. కళ్యాణ్ అక్కడ చెప్పిన కవితలని ఆలోచిస్తూ నవ్వుకుంటాడు. కానీ అనామికకి మాత్రం ఆఫీసులో చాలా పనులు చేశా అని చెబుతాడు.

Brahmamudi Serial feb 17th episode : Kavya's first step to get Raj's love, will the plan work?

ఈరోజు ఆఫీసుకు వెళ్ళకు మనం షాపింగ్ కి వెళ్దాం అని అనామిక అంటుంది. సరే ఉండు క్రెడిట్ కార్డ్స్ తీసుకొని వస్తా అని కళ్యాణ్ వెళ్తుండగా, ఎక్కడికి వెళ్తున్నావ్ అని అనామిక అడుగుతుంది. ఇంతకముందు పెద్దమ్మ దగ్గర ఉండేవి ఇప్పుడు కావ్య వదిన దగ్గరే ఉంటాయి కదా అని చెబుతాడు. ఇప్పుడు ఆమెని అడిగితేనే షాపింగ్ కి వెళ్ళాలి అంటే అవసరం లేదు అని అనామిక చెప్పి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తుంది.

నేను కూడా ఈ ఇంటి కోడలినేగా అత్తయ్య, కావ్య కి ఉన్న హక్కులు నాకు లెవా అని అడుగుతుంది. కావ్య కన్నా నీకే ఉన్నాయ్ అని అంటుంది ధాన్యలక్ష్మి. మరి అయితే క్రెడిట్ కార్డ్స్ కావ్య దగ్గరే ఉన్నాయ్ ఇక ఏమి కావాలన్నా ఆమెని అడగాలా అని అనామిక కోపంగా అంటుంది.

కట్ చేస్తే, కావ్య వంటింట్లో ఉంటే కావ్య దగ్గరికి వచ్చి ఆ సర్ప్రైజ్ ఏంటి అని కావ్యని అడుగుతాడు. ఇంతలో అమ్మమ్మ వస్తుంది. ఏంటి అమ్మ కావ్య ఎదో సర్ప్రైజ్ అన్నావ్ ఇంకా ఇక్కడే ఉన్నావ్ ఏంటి వెళ్లి రెడీ అవ్వు అని అమ్మమ్మ అంటుంది. ఆ సర్ప్రైజ్ ఏంటో నీకు తెలుసా? అమ్మమ్మ అని రాజ్ అడుగుతాడు. ఆ తెలుసు అని బదులిస్తుంది. ఏంటి ఆ సర్ప్రైజ్ అని అడిగితే, నాకు కూడా తెలీదు రా! నాకు కూడా సర్ప్రైజ్ అనే చెప్పింది అని అమ్మమ్మ అంటుంది.

కావ్య రెడీ అవ్వడం చూసి ఏంటి మళ్ళీ అప్పలమ్మ లాగా రెడీ అయ్యావ్ అని రాజ్ అంటాడు. ఇంకోసారి అప్పలమ్మ అంటే బాగోదు..నా కట్టు బొట్టుకి కూడా ఫ్యాన్స్ ఉన్నారని కావ్య అంటుంది. ఇప్పుడు నేను ఎయిర్ పోర్ట్ కి వెళ్తున్న అని కావ్య సిగ్గుపడుతూ చెబుతుంది. మా బావ వస్తున్నాడు, అని సిగ్గుపడుతూ చెబుతుంది.  నేను ఎయిర్ పోర్ట్ కి వెళ్లి, డైరెక్ట్ గా ఆఫీసుకు తీసుకొచ్చి మిమ్మల్ని పరిచయం చేపిస్తా అని కావ్య చెప్పి వెళ్తుంది.

Comments are closed.