Brahmamudi serial feb 9th episode : నేటి బ్రహ్మ ముడి ఎపిసోడ్‌లో, ఇంట్లో వారంతా తమకు కావాల్సిన వస్తువులు ఒక లిస్ట్ లో రాసి ఇంటి పెద్ద కోడలు అయిన అపర్ణకు ఇస్తారు. కానీ ధాన్యలక్ష్మి మాత్రం లిస్ట్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది. అయితే, ధాన్యలక్ష్మి కి షాక్ ఇవ్వాలని కావ్య ని పిలుస్తుంది. నీ లిస్ట్‌లో ఏముందని అపర్ణ కావ్యని అడుగుతుంది. నాకు పెద్దగా ఏమీ లేదు అత్తయ్య. మీ అబ్బాయి లిస్ట్‌లోనే నాకు కావాల్సినవి రాశాను అని చెబుతుంది.
అపర్ణ “సరే, ఇప్పుడు నీకు మరో బాధ్యత ఉంది.” అని అంటుంది, ఏంటి అది అత్తయ్య అని అడుగుతుంది. ఈరోజు నుండి ఇంటి పనులన్నీ నువ్వు చేపడతారని అపర్ణ చెప్పింది. ఇది తెలుసుకున్న ధాన్యలక్ష్మి, అనామిక మరియు రుద్రాణి షాక్ అవుతారు. ఇందిరాదేవి, సుభాష్, ప్రకాష్ సంతోషిస్తారు.
అపర్ణ ఇంటి తాళాలను తన కోడలికి ఇచ్చింది.
నేను చాలా కాలంగా చూస్తున్నాను. దుగ్గిరాల వంశానికి పెద్ద కోడలు అయిన నేను ఇప్పుడు ఈ బాధ్యతలను నీకు అప్పగిస్తున్నాను. కానీ కావ్య ఒప్పుకోదు. అపర్ణ లాకర్ కీలను కావ్యకు ఇస్తుంది. తీసుకో’ అని ఇందిరాదేవి, సుభాష్, ప్రకాష్ అంటారు. కావ్య ఇక తాళాలు తీసుకుంటుంది. రుద్రాణి మరియు అనామిక కావ్యను తిట్టించాలని చూస్తున్నాను.
Also Read : Guppedantha Manasu serial feb 8th episode : రిషికి సంతాపసభ ఏర్పాటు, శైలేంద్ర పై చేయి చేసుకున్న వసు
అప్పు పోలీసు ఉద్యోగానికి ప్రయత్నం..
అప్పు, కృష్ణ మూర్తి కోచింగ్ సెంటర్ గురించి చర్చిస్తారు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇలా ఎన్ని సంవత్సరాలుగా శిక్షణ తీసుకుంటున్నావు అని కృష్ణ మూర్తి అప్పుని ప్రశ్నిస్తాడు. నాన్న.. పోలీసు శిక్షణ అంటే అంతే ఉంటుంది. మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మెరుగ్గా ఉంటాం. నోటిఫికేషన్ రాకముందే నేను శిక్షణ తీసుకుంటే, నేను ఫిట్‌గా ఉంటాను అని చెప్పింది. అప్పుకి సహాయం చేయడానికి ఎవరో వారి దగ్గరికి వచ్చారు. ఈ రోజుల్లో పోలీసు ఉద్యోగాలు రావడం చాలా కష్టం. ఐదు లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. అయితే, అప్పు ఇంకా కృష్ణ మూర్తి గట్టి వార్నింగ్ ఇస్తుంది.
కళ్యాణ్ ని బుట్టలో పడేసిన అనామిక. ఆఫీసుకు బయలుదేరిన కవి..
కళ్యాణ్ కారు కీ కోసం చూస్తున్నాడు. అనామిక అప్పుడే కళ్యాణ్‌ని టెంప్ట్ చేస్తుంది. అనామిక అందాలను చూసి అతను టెంప్ట్ అవుతాడు. ఆ తర్వాత అనామికని కళ్యాణ్ ముద్దు పెట్టుకోవడానికి చూస్తాడు కానీ కళ్యాణ్ ని అనామిక నెట్టేసింది. నువ్వు నా ఇష్టం వచ్చినట్లు ఆఫీసుకు వెళితే నేను నీ ఇష్టం వచ్చినట్లు ఉంటాను అని కళ్యాణ్ ని ఒప్పించింది అనామిక.
శ్వేతపై ఎనలేని ప్రేమ చూపిస్తున్న రాజ్..
ఆ తర్వాత కావ్య, రాజ్ ఆఫీసుకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడే, రాజ్ శ్వేతకి ఫోన్ చేసి నీ కోసం నేను వస్తున్న శ్వేతా అని ప్రేమ గా మాట్లాడతాడు. కావ్య ఆ మాటలు వినగానే కంగారు పడుతుంది. ఇలా చెప్పి ఆఫీసుకు బయలుదేరాడు రాజ్. ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలని కావ్య ఆసక్తిగా రాజ్ వెనకే వెళ్తుంది.
రుద్రాణి, అనామిక కావ్యను సుడిగుండంలో నెట్టబోతున్నారు.
అప్పుడే రుద్రాణి ప్రత్యక్షమైంది. ఆమె లాకర్ యొక్క తాళం చూస్తుంది. కావ్య రుద్రాణిని అద్దంలో చూసి, ఏంటి రుద్రాణి గారు ఇలా వచ్చారు అని కావ్య అడుగుతుంది. రుద్రాణి కావ్యతో మాట్లాడుతూ చిన్న లాకర్ తాళాలను డస్ట్ బిన్ లోకి నెట్టేస్తుంది. కావ్య కూడా హడావిడిగా వెళ్లాలని చూస్తుంది. ఆ తర్వాత కావ్య టెన్షన్ తో రాజ్ ని ఫాలో అవ్వడానికి వెళ్తుంది. రుద్రాణి లాకర్ కీస్ తీసుకుని అనామిక దగ్గరకు వెళ్తుంది. రుద్రాణి, అనామిక ఇక కావ్యని పని అయిపోయిందని అనుకుంటారు.