Guppedantha Manasu serial feb 8th episode : రిషికి సంతాపసభ ఏర్పాటు, శైలేంద్ర పై చేయి చేసుకున్న వసు

ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

Guppedantha manasu serial feb 8th episode : తెలుగు టీవీ సీరియల్స్ లో గుప్పెడంత మనస్సు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉన్న సీరియల్స్ లో ఒకటి. ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

రిషి చావు పై ముఖుల్, అనుపమ అనుమానం..

రిషిని చంపాల్సిన అవసరం శైలేంద్రకి తప్ప ఇంకెవరికి ఉంది అని అనుపమ ముఖుల్ ని అడుగుతుంది. శైలేంద్రకి రిషిని చంపే అవసరం ఉండొచ్చేమో కానీ భద్ర చంపేశాడేమో అని ముఖుల్ అనుమానిస్తాడు. మీరు అయితే ముందు వసుధార మేడంని జాగ్రత్తగా చూసుకోండి అని ముఖుల్ చెబుతాడు.

శైలేంద్ర, దేవయాని ఆనందానికి హద్దులు లేవు..

రిషి చనిపోయాడని తెలియగానే శైలేంద్ర, దేవయాని ఎంతో సంతోషిస్తారు. దేవయాని తన భర్త అయిన ఫణింద్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నా ఆలోచన మొత్తం మీ నాన్న గురించే నాన్న అని శైలేంద్ర తో చెబుతుంది. రిషి చనిపోయాడు అని తెలియగానే గుండెల్లో నొప్పి వచ్చింది. డాక్టర్స్ విశ్రాంతి తీసుకోమని చెప్పారు అని దేవయాని అంటుంది.

డాడీ కోలుకునేలోపు మనం అనుకున్న ఎండీ సీట్ మనకి దక్కాలి అని, వసుధారని ఎండీ సీట్ నుండి ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు అని శైలేంద్ర అంటాడు.

Guppedantha Manasu serial feb 8th episode : Condolence meeting organized for Rishi, Vasu who got hold of Shailendra

Also Read : Guppedantha Manasu serial feb 7th episode : రిషి ఫోటోకి దండ, గోల చేసిన వసు, అనుపమ-ముఖుల్ అనుమానం భద్రనేనా

రిషికి సంతాపసభ..

వసుధార కాలేజీకి వస్తుంది. తన క్యాబిన్ కి వెళ్తుండగా అందరూ కాలేజీ ఎంట్రన్స్ దగ్గర నిలుచొని ఉంటారు. సారీ మేడం, రిషి సర్ చనిపోయారని తెలియగానే మేము అందరం బాధపడుతున్నాం. రిషి సర్ అంటే డీబీఎస్టి కాలేజీ, డీబీఎస్టి కాలేజీ అంటేనే రిషి సార్ అని స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తారు. మీరు ఒప్పుకుంటే సంతాపసభ జరిపించాలని అనుకుంటున్నారు అని శైలేంద్ర అంటాడు.

రిషి సార్ చనిపోయారని ఎవరు చెప్పారు? ఆయన బ్రతికే ఉన్నారు. క్షేమంగానే ఉన్నారు అని వసు అందరికి చెబుతుంది. రిషి చనిపోయాడని డీఎన్ఏ రిపోర్ట్ వచ్చింది కదా వసుధార, నువ్వు ఎందుకు నమ్మడం లేదు అని శైలేంద్ర వసుధారని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు. ఇంకోసారి రిషి సార్ చనిపోయారు అని అంటే నేను ఊరుకోను అని చెప్పి వసు తన క్యాబిన్ కి వెళ్తుంది.

శైలేంద్రని చంప దెబ్బ కొట్టిన వసుధార..

వసుధార తన క్యాబిన్ లో కూర్చొని ఫైల్ లో ఉన్న పేపర్స్ ని చింపి పడేస్తూ ఉంటుంది. ఇంతలో శైలేంద్ర వసు వద్దకు వచ్చి ఎండి సీట్ నాకు ఇచ్చేయ్ అంటూ మాట్లాడుతాడు. ఎండీ సీట్ కాదు కాలేజీ గేట్ కూడా నిన్ను దాటనివ్వను అని వసుధార చిటికెలు వేస్తూ శైలేంద్రకి చెబుతుంది. రిషి గాడు ఎలాగో లేడు అని అనగానే వసుధార, శైలేంద్ర ని కొడుతుంది. రిషి సార్ చనిపోలేదు అని నీకు చాలా సార్లు చెప్పా, మళ్ళీ అంటున్నవ్ ఏంటి? నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అని వసుధార శైలేంద్ర కి వార్నింగ్ ఇస్తుంది.

ఇక్కడ నుండి వెళ్ళకపోతే మెడ పట్టుకొని బయటికి గెంటేయాల్సి వస్తుంది అని శైలేంద్రకి గట్టిగా చెబుతుంది. శైలేంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

మహీంద్ర ఆవేదన..

మహీంద్ర రోడ్ పక్కన ఒక చెట్టు కింద కూర్చొని రిషి జ్ఞాపకాలను తలచుకుంటూ ఏడుస్తాడు. బాధని తట్టుకోలేక ఆల్కహాల్ తీసుకుంటూ ఏడుస్తాడు. రిషి తనతో ఉన్న రోజులు, తనతో మాట్లాడిన మాటలు, రిషి నవ్వులు అన్నీ తలచుకొని మహీంద్ర కుమిలిపోతూ ఉంటాడు. ఇంతలో అనుపమ వచ్చి ఆ ఆల్కహాల్ బాటిల్ తీసుకుంటుంది.

Comments are closed.