Telugu Mirror : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ లో కొనసాగుతుంది. కార్తీక దీపం సీరియల్ శుభం పలికాక అదే సమయంలో బ్రహ్మముడి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రజాధారణ పొందిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
రాజ్ శ్వేతతో ఉన్న సంఘటన గుర్తు చేసుకుంటూ కావ్య బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రాజ్ కావ్య దగ్గరకు వచ్చి ఒంట్లో ఎలా ఉంది, హాస్పిటల్ కి వెళ్ళావ్ అంట కదా! డాక్టర్ ఎం అన్నారు? టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతాడు. బిజీ గా ఉన్న అందుకే రాలేకపోయా అని చెప్తాడు. నేను అర్ధం చేసుకోగలను అని బాధపడుతూ చెప్పి అక్కడికి నుండి వెళ్ళిపోతుంది.
Also Read : Brahmamudi serial Today episode : తోడి కోడళ్ల మధ్య రగులుతున్న చిచ్చు.. అనామిక, రుద్రాణి ప్లాన్ వర్క్అవుట్
తోడికోడళ్ల మధ్య మొదలయిన గొడవలు..
అపర్ణ తన భర్తతో భోజనం దగ్గర జరిగిన విషయం గురించి చెప్పింది. కళ్యాణ్ ని పని వాడిలా చూస్తున్నానని ధాన్యలక్ష్మీ అంటుంది అని ఆమె భర్తతో చెబుతుంది. ఇంట్లో రాజ్ ని కళ్యాణ్ ని వేరు చేసి చూసే వాళ్ళు ఎవరు లేరని అపర్ణ భర్త చెబుతాడు. ధాన్యలక్ష్మీ అలా మాట్లాడడం ఇష్టం లేదంటూ అపర్ణ అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
ఇటు ధాన్యలక్ష్మి కూడా తన భర్త వద్దకు వచ్చి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుస్తుందా? కళ్యాణ్ ని వేరు చేసి చూస్తున్నారు అని చెప్పింది. మా వదిన రాజ్ కన్నా కళ్యాణ్ నే ఎక్కువ గారాబం చేసి చూసింది అని ధాన్యలక్ష్మి భర్త చెబుతాడు. కానీ ధాన్యలక్ష్మి వినదు. ఇక ఇద్దరన్నదమ్ముళ్లు ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో అంటూ మాట్లాడుకుంటూ డ్రింక్ చేస్తారు.
కవికి శ్వేత గురించి చెప్పిన కావ్య …
బాధపడుతూ ఉన్న కావ్య దగ్గరికి కళ్యాణ్ వచ్చాడు. తన మనసులో ఉన్న బాధని పంచుకోమంటాడు. లేకపోతే నా మీద ఒట్టే అని చెబుతాడు. ఇక కావ్య నిజమేంటో కళ్యాణ్ కి చెబుతుంది. కళ్యాణ్ తనకి శ్వేత తెలుసు అని ఇంతకు ముందు అన్నయ్యని ఇష్టపడింది పెళ్లి చేసుకోవాలని అనుకున్నది అని చెబుతాడు. అదే అమ్మాయి మళ్ళీ మీ అన్నయ్య లైఫ్ లోకి వచ్చింది అని కావ్య చెబుతుంది. ఇంతలో అనామిక వస్తుంది. అనామిక రాగానే వాళ్ళు మాట్లాడుకోవడం ఆపేస్తారు. అనామికకి డౌట్ క్రియేట్ అయింది.
అనామికాని రెచ్చగొట్టిన రుద్రాణి…
కావ్య, కళ్యాణ్ అనామిక గురించే మాట్లాడుకున్నారని, కావ్య మిమ్మల్ని విడదీసి కళ్యాణ్ ని అప్పు కి ఇచ్చి పెళ్లి చేస్తుందని చెబుతుంది. ఇక రుద్రాణి మాటలు విన్న అనామిక టెన్షన్ పడుతుంది.
ఇక బెడ్ పై పడుకొని ఉన్న కావ్య ని చూసి పడుకున్నావా అని రాజ్ అడుగుతాడు. నా కళ్ళు తెరుచుకునే ఉన్నాయ్ నాకు పడుకున్నట్టు నటించడం రాదు అని అంటుంది. ఏదైనా అడగాలా అని రాజ్ అడిగితే క్లారిటీ వచ్చాక అడుగుతా అని చెబుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.