Brahmamudi serial Today episode : తోడి కోడళ్ల మధ్య రగులుతున్న చిచ్చు.. అనామిక, రుద్రాణి ప్లాన్ వర్క్అవుట్

ఎక్కువగా పాపులర్ అయిన బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏమిటో తెలుసుకుందాం.

Telugu Mirror : స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ లో కొనసాగుతుంది. కార్తీక దీపం సీరియల్ శుభం పలికాక అదే సమయంలో బ్రహ్మముడి సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. రాత్రి 7:30 నిమిషాలకు టెలివిజన్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రజాధారణ పొందిన ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.

రాజ్ శ్వేతను ఎత్తుకొని హాస్పిటల్ కి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కావ్యకి కళ్ళు తిరగడం వల్ల వాళ్ళ అక్క స్వప్న హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. హాస్పిటల్ లో రాజ్, శ్వేతను చూసిన కావ్య మరింత బాధపడుతూ ఉంటుంది. ఇంతలో స్వప్న వచ్చి రిపోర్ట్స్ వచ్చాయి వెళ్దాం అని ఇంటికి వెళ్తారు.

కుమిలిపోతున్న కావ్య ..

brahmamudi-serial-today-episode-fiery-raging-between-sisters-anamika-rudrani-plan-workout

Also Read : Guppedantha manasu serial today Episode : కాలేజీలో జరిగే ఫెస్ట్ సక్సెస్ కానివ్వనంటున్న శైలేంద్ర..రిషి లేకుండా వసు ఒంటరిగా.. ఏం జరగనుంది?

హాస్పిటల్ లో జరిగిన సంఘటన కావ్యకు ఎక్కువగా గుర్తొస్తుంది. తనకు బీపీ డౌన్ అయింది అని, బాగా నీరసంగా ఉంది అని స్వప్న ఇంట్లో అమ్మమ్మకి చెబుతుంది. కానీ కావ్య అదే ఆలోచనలో పడి కుమిలిపోతూ ఉంటుంది.

అప్పు మనసులో ఇక కవి లేడు ..

అప్పు తల్లిద్రండులు ఇంటి ముందు చలి కాచుకుంటున్నారు. ఇంతలో కళ్యాణ్ ఫొటోస్, అతని ఇచ్చిన చీరని ఆ మంటల్లో వేసి కాల్చేస్తుంది. ఇక నా మనసులో ఆ కవి లేడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇప్పటి నుండి ప్రశాంతంగా ఉంటా అని అప్పు తన తల్లిద్రండులకి చెబుతుంది.

తోడి కోడళ్ల మధ్య రగులుతున్న చిచ్చు ..

brahmamudi-serial-today-episode-fiery-raging-between-sisters-anamika-rudrani-plan-workout

అనామిక, రుద్రాణి కలిసి వేసిన ప్లాన్ వర్క్అవుట్ అవుతుంది. ఇంట్లో అన్ని పనులు కళ్యాణ్ కి చెప్పి తనని పని వాడిని చేస్తున్నారని రుద్రాణి  ధాన్య లక్ష్మి కి లేనిపోని మాటలు నూరి పోస్తుంది. ఆ రుద్రాణి చెప్పిన మాటలు మనసులో పెట్టుకొని రాజ్ అమ్మపై ధాన్య లక్ష్మి విరుచుకుపడుతుంది.

అనామిక మాటలు కళ్యాణ్ విన్నాడా ..

అనామిక తన గదిలో వాళ్ళ అమ్మకి కాల్ చేసి అనుకున్న ప్లాన్ అనుకున్నట్టుగా జరుగుతుందని తొందర్లోనే తను అనుకున్నది సాధిస్తుందని  చెబుతూ ఉంటుంది. ఇంతలో గదిలోకి కళ్యాణ్ వస్తాడు. మాట్లాడిన మాటలు విన్నాడేమో అని అనుకున్నది అనామిక. కానీ అతను వినలేదు. శోభనానికి ముహూర్తం పెట్టాలి అంటూ మాట్లాడతాడు.

Comments are closed.