Geethanjali Malli Vachindhi: ఆమ్మో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’, చుస్తే అదురు పుట్టాల్సిందే, ఏ ఓటీటీలో ఉందంటే?

తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. సుమారు పదేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, భయపెట్టిన గీతాంజలికి ఇది సీక్వెల్.

అంజలి 50వ చిత్రం గీతాంజలి ఈజ్ బ్యాక్ ఎగైన్ చిత్రం పై ప్రారంభం నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఫలితంగా, ఈ చిత్రం మొదటి విడుదల తర్వాత మంచి టాక్ తెచ్చుకోలేదు ఫలితంగా ఈ మూవీ ఓపెనింగ్స్‌తో పాటు ఆ తర్వాత కూడా కలెక్షన్లను పెద్దగా వసూలు కాలేదు. తద్వారా ఈ సినిమా నష్టాలతోనే రన్‌ను ముగించింది. అప్పటి నుంచి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ గురించి ఫిలిం నగర్ ఏరియాలో ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి.

ప్రముఖ OTT వ్యాపార సంస్థ ఆహా (Aha ott), ఫన్ అండ్ హారర్ కథా చిత్రం గీతాంజలి ఈజ్ బ్యాక్ ఎగైన్ డిజిటల్ స్ట్రీమింగ్ (Digital  Streaming) హక్కులను పొందింది. ఈ విషయంలో సంస్థ గణనీయమైన ఆర్థిక పెట్టుబడులు పెట్టింది. ఇంకా, ఈ చిత్రం మే 8 నుండి ప్రసారం అవుతుందని తెలిపింది అయితే, బుధవారం అర్ధరాత్రి నుండి చిత్రం అందుబాటులో లేదు. అనుకున్న సమయానికి (మే 8) ప్రసారం కానందున ‘గీతాంజలి ఈజ్ బ్యాక్’ సినిమా OTT వాయిదా పడిందని అందరూ భావించారు.

అయితే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఈ చిత్రం బుధవారం సాయంత్రం ఆహాలో విడుదలైంది. ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభిస్తున్నట్లు సమాచారం. హర్రర్ కాన్సెప్టుతో రూపొందిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని కోన వెంకట్ (Kona Venkat) , ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఇందులో సునీల్, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, సత్య, అలీ, రవిశంకర్, శైలజా ప్రియ తదితరులు నటించారు. ఈ మూవీకి ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ కంపోజ్ చేశారు.

Comments are closed.