Telugu Mirror : తెలుగు టీవీ సీరియల్స్ లో గుప్పెడంత మనస్సు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉన్న సీరియల్స్ లో ఒకటి. ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
టెన్షన్ లో శైలేంద్ర..
వసుధార చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ శైలేంద్ర నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటాడు. ధరణి లేచి ఎందుకు కంగారు పడుతున్నారు అండి అని అడుగుతుంది. శైలేంద్రతో వాదిస్తుంది. శైలేంద్ర చిరాకు పడుతూ ఉంటాడు. ధరణిని పడుకోమని చెబుతాడు. సరే అని పనుకుంటుంది.
భద్ర ఇంట్రాగేషన్ మొదలు..
ముఖుల్ భద్రని ఇంట్రాగేషన్ చేస్తాడు. మహీంద్ర వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఫెస్ట్ రోజు రిషి మిస్ అయ్యాడు. దానికి కారణం నువ్వేనా? ఆ శైలేంద్రకి నీకు ఎటువంటి సంబంధం ఉంది? అని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. వాళ్ళు ఎంత డబ్బు అయితే ఇస్తారో నేను కుడా అంతకన్నా ఎక్కువ డబ్బు ఇస్తాను. నిజం చెప్పు అని ముఖుల్ అడుగుతాడు.
Also Read : Guppedantha manasu serial feb 2nd episode : భద్ర నిజస్వరూపం బయటపెట్టిన వసుధార.. శైలేంద్ర గుండెల్లో దఢ
నాకు కొంచం టైం కావాలి? ఒక పూట టైం ఇస్తే రేపు ఉదయాన్నే అంతా చెబుతాను అని భద్ర అంటాడు. సరే రేపు నిజం వస్తుంది అని అనుకుంటున్నాను అని చెప్పి ముఖుల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
కస్టడీ నుండి తప్పించుకున్న భద్ర..
ముఖుల్ వసుధార వాళ్ళ ఇంటికీ వస్తాడు. అందురూ రిషి గురించి ఏమైనా తెలిసిందా? భద్ర శైలేంద్ర మనిషేనా? రిషి ఎక్కడ ఉన్నాడు?భద్ర ఏం చెప్పాడు? ఇంట్రాగేషన్ లో ఏం రుజువయింది అని ముఖుల్ ప్రశ్నించారు? నేను ఒక విషయాన్నీ చెప్పడానికి వచ్చాను. భద్ర కస్టడీ నుండి తప్పించుకున్నాడు అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు.
సంతోషంలో శైలేంద్ర, దేవయాని..
శైలేంద్రకు భద్ర తప్పించుకున్నాడు అనే వార్త తెలియగానే దేవయాని దగ్గరకి వెళ్లి నాకు చాలా సంతోషంగా ఉంది మమ్మీ అని చెబుతాడు. ఏంటి శైలేంద్ర భద్ర గురించి నేను టెన్షన్ పడుతుంటే నువ్వు ఏంటి హ్యాపీ గా ఉన్నావ్ అని అడుగుతుంది. అక్కడ భద్ర మన విషయం బయట పెడతాడేమో అని భయంగా ఉంది అని అంటుంది దేవయాని. అసలు నిజం చెప్పాలంటే భద్ర ఉండాలి కదా మమ్మీ అని శైలేంద్ర దేవయానికి చెబుతాడు. తల్లీకొడుకులు మాట్లాడుకునే మాటలు రహస్యంగా ధరణి వింటుంది. మరి భద్రని ఎవరు తప్పించారు? అనే విషయం తెలియాల్సి ఉంది.