Telugu Mirror : తెలుగు టీవీ సీరియల్స్ లో గుప్పెడంత మనస్సు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉన్న సీరియల్స్ లో ఒకటి. గుప్పెడంత మనస్సు సీరియల్ కి మంచి రేటింగ్ కూడా ఉండేది కానీ సీరియల్ టైమింగ్స్ మారాయి కాబట్టి రేటింగ్ లో కాస్త తగ్గింది. గుప్పెడంత మనసు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకుందాం.
వసుధారా జగతి ఫోటోకి దండం పెట్టుకొని వెళ్ళగానే జగతి ఫోటో కింద పడిపోతుంది. దీంతో మహేంద్ర ఏదైనా కీడు జరుగుతుందేమో అని అనుకుంటాడు. వసుధారా హడావుడిగా కాలేజీకి వెళ్లి చూడగానే షాక్ అవుతుంది. శైలేంద్ర చేసిన పనికి వసుధారా అయోమయంలో పడుతుంది.
రిషి ఈవెంట్ కి వస్తున్నాడంట..
శైలేంద్ర రిషి వస్తున్నాడని కాలేజీలో అందరికీ చెబుతాడు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా పెడతాడు. అవి చూసి వసుధారా షాక్ అవుతుంది. స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరూ రిషి వస్తున్నారంట కదా నిజమేనా! మాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటారు. రిషి వస్తున్నాడని అందరూ సంతోషిస్తారు. ఇంతలో మహేంద్ర, అనుపమ కూడా కాలేజీకి వస్తారు. ఆ ఫ్లెక్సీలు చూసి అక్కడ ఒక స్టూడెంట్ ని ఈ ఫ్లెక్సీలు ఎవరు పెట్టించారు అని అడుగుతాడు. ఆ స్టూడెంట్ వసుధారా మేడం పెట్టించింది అని చెబుతాడు. వెంటనే వసుధారాని అడుగుతారు. ఈ పని శైలేంద్ర చేసాడు అని వసుధారా చెబుతుంది.
అయోమయంలో పడ్డ వసుధారా..
అందరూ రిషి వస్తున్నాడని చాలా ఆనందపడుతున్నారు. ఇప్పుడు రిషి సర్ ని తీసుకురాకపోతే కాలేజీ లో ఈవెంట్ ప్లాప్ అవుతుంది. స్టూడెంట్స్ అందరూ గొడవ చేస్తారు. కానీ రిషి సర్ రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో వసుధారా ఉంది. టెన్షన్ పడుతున్న వసుధారా వద్దకు శైలేంద్ర వస్తాడు.
రివర్స్ దెబ్బ కొట్టిన వసుధారా..
శైలేంద్ర వసుధారా దగ్గరికి వచ్చి ఇప్పుడు రిషిని తీసుకొస్తేనే నీకు ఎండీ పోస్ట్ ఉంటుంది ఇంకా స్టూడెంట్స్ అందరికీ నీ మీద నమ్మకం ఉంటుంది అని చెబుతాడు. కానీ రిషి రాడు ఈ ఈవెంట్ సక్సెస్ అవ్వదు అని విర్రవీగుతూ చెబుతారు. కానీ వసుధారా, రిషి ఈవెంట్ కి వస్తున్నాడని అని చెప్పి శైలేంద్ర ప్లాన్ ప్లాప్ చేస్తుంది. మరి ఇంతకీ ఈవెంట్ కి వసుధారా రిషిని తీసుకొస్తుందా లేదా అని చూడాలి.