Telugu Mirror : చలికాలం ప్రారంభ దశలో ఉంది. ఈ శీతాకాలం (Winter) లో పగటి పూట సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. చలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారడం, జుట్టు రాలడం (Hair fall), చుండ్రు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాలానుగుణంగా మనం కూడా జుట్టు రాలకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు (Precautions) పాటించాలి. మీరు తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు చేస్తూ జాగ్రత్తలని పాటిస్తే సరిపోతుంది. అయితే ఈ ఋతువు ప్రారంభ దశలో ఉన్నప్పుడే తగిన జాగ్రత్తలు పాటిస్తే అధిక చలి ఉన్నప్పుడు మీ జుట్టు తట్టుకోగలదు. ఈ సీజన్‌లో, చాలా మందికి జుట్టు రాలడం జరుగుతుంది, దీని వల్ల బట్టతల పెరగడం వల్ల తరచుగా ఆందోళన చెందుతారు.
శీతాకాలం లో మీ జుట్టు రాలకుండా ఉండేందుకు ఎం చేయాలో ఇప్పుడు చూద్దాం..
కరివేపాకు జుట్టుకు ఎలా ఉపయోగపడుతుంది:
మీరు మొదటి దశగా ప్రతిరోజూ కనీసం 5-7 కరివేపాకులను (curry leaves) తినడం ప్రారంభించాలి. మీరు తినే వంటకాలలో అంటే ఉప్మా లాంటి వాటిల్లో కూడా కరివేపాకు చేర్చుకోవచ్చు. ఈ ఆకులు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడం తో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడం, ఇన్సులిన్ నిరోధకతను పెంచడం మరియు జుట్టు (Hair) త్వరగా తెల్లబారకుండా ఉంచుతుంది. ఐదు నుండి ఏడు కరివేపాకులను ఒక కప్పు నీటిలో మరిగించి, వడగట్టి, ఆపై టీ గా కూడా తీసుకోవచ్చు. దీనితో పాటు వేప ఆకుల్లో కూడా గొప్ప ఔషధ గుణాలు ఉంటాయని మనకి తెలుసు. కొన్ని ఆకులు నీటిలో వేసి మరిగించి ఆపై మీ జుట్టుకు అప్లై చేస్తే చుండ్రుని నివారించడంలో సహాయపడుతుంది.
Also Read : ఓం అనే మంత్రాన్ని ప్రతిరోజూ పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా
జుట్టు రాలడాన్ని నువ్వుల నూనె ఎలా నివారిస్తుంది:
నువ్వుల నూనెలో (Sesame Seed oil) అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో అధికంగా యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, అందువల్ల రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది. నువ్వుల నూనె గుండెకు చాలా మంచిది దానితో పాటు ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు మరియు కీళ్లకు బలాన్ని అందిస్తుంది. నువ్వులను ఆహారం లో చేర్చుకునేందుకు చాలా మార్గాలు కూడా ఉన్నాయి .
మీ జుట్టుకి ఆవు నెయ్యి ఎలా ఉపయోగపడుతుంది:
ఆవు నెయ్యి (Cow ghee) తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, జుట్టుకు కూడా అంతే మేలు చేస్తుంది. దీన్ని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టుకు పోషణ పెరుగుతుంది . జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది. నెయ్యిలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి స్కాల్ప్‌ను (Scalp) బ్యాక్టీరియా, ఫంగస్ నుంచి రక్షిస్తుంది. నెయ్యిని ఉపయోగించడం ద్వారా అనేక జుట్టు సమస్యలను అధిగమించవచ్చు.
Also Read : పిల్లలకు జలుబు, దగ్గుతో ఇబ్బందా, అయితే జింజర్ క్యాండీని చేసి ఇవ్వండిలా
ನಕ್ಸಲರ ವಿರುದ್ಧ ಕಾರ್ಯಾಚರಣೆ ನಡೆಸಿದ್ದ ಎಎನ್ಎಫ್ ಪೊಲೀಸರು ಸೋಮವಾರ ರಾತ್ರಿ ಉಡುಪಿ ಜಿಲ್ಲೆಯ ಹೆಬ್ರಿ ತಾಲೂಕಿನ ಕಬ್ಬಿನಾಲೆ ಬಳಿ ಎನ್ಕೌಂಟರ್…
ಬ್ರಂಟನ್ ರಸ್ತೆ, ಶೋಭಾ ಪರ್ಲ್, ಐಸಿಐಸಿ ಬ್ಯಾಂಕ್, ಎಂಬೆಸ್ಸಿ ಹೈಟ್ಸ್, ಆಭರಣ್ ಜ್ಯೂವೆಲರ್ಸ್. ಹರ್ಬನ್ ಲೈಫ್, ಆರ್ಎಂಝಡ್, ಅಶೋಕ್ ನಗರ,…
[epaper_viewer] Aadhaar Update : మన దేశంలో వాస్తవంగా అన్ని కార్యకలాపాలకు ఆధార్ కార్డు (Aadhaar card) తప్పనిసరి అయింది.…
[penci_liveblog] Microsoft Windows crashes : ఈ ప్రపంచంలో, Windows, Linux మరియు Apple వంటి కొన్ని ప్రత్యేక సాఫ్ట్‌వేర్…
Samsung Galaxy M35 5G : శాంసంగ్ కంపెనీ భారతదేశంలో కొత్త M-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్…
Honor 200 5G Series : హానర్ 200 మరియు హానర్ 200 ప్రోతో కూడిన హానర్ 200 సిరీస్…