Actor Vijay Kanth Died: కరోన మరియు తీవ్ర ఆరోగ్య సమస్యలతో నటుడు కెప్టెన్ విజయ్ కాంత్ కన్నుమూత

ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ కాంత్ ఇక లేరు కరోనా మరియు శ్వాస కోస వ్యాధి సమస్యలతో మృతి చెందారు, విజయ్ కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి. 27 ఏళ్ళ వయసులో తెరంగేట్రం చేసిన విజయకాంత్ 2015 వరకు నిర్విరామంగా సినిమాలలో నటించారు. విజయ్ కాంత్ చివరి సినిమా మధుర వీరన్ 2018లో వచ్చింది.

Telugu Mirror: ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ కాంత్ ఇక లేరు కరోనా మరియు శ్వాస కోస వ్యాధి సమస్యలతో మృతి చెందారు, విజయ్ కాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్స్వామి (Narayanan Vijayraj Alagarswamy) , 1952 ఆగస్టు 25 న తమిళనాడులోని మధురైలో k.n అలిగిరి స్వామి, ఆండాళ్ అజ్గార్ స్వామి (Aandal Azhagarswami) దంపతులుకు జన్మించారు, 1990 జనవరి 31న ప్రేమలతని వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు విజయ ప్రభాకర్ (Vijay Prabhakar), షణ్ముఖ పాండ్యన్ (Shanmuga Pandian), విజయ్ కాంత్ సినిమా గ్రఫీ చూసినట్టు అయితే 1979 వచ్చిన ఇనిక్కుమ్ ఇలామై  (Inikkum Ilamai) చిత్రంతో సినిమాలోకి అరంగేట్రం చేశారు 154 సినిమాలకి పైగా నటించిన విజయ కాంత్, 20 సినిమాలు పైగా పోలీస్ పాత్రలో హీరోగా నటించారు,

విజయ్ కాంత్ చివరి సినిమా మధుర వీరన్ (Madura Veeran) 2018లో వచ్చింది.

పది రోజులు క్రితమే లివర్ ఇన్ఫెక్షన కి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన విజయ్ కాంత్, మూడు రోజుల క్రితం కరోనా సోకటంతో మరియు గతంలో శ్వాసకోశ వ్యాధి, మధుమేహం లాంటి వ్యాధులు ఉండడంతో వైద్యులు బ్రతికించలేకపోయారు.

2005 సెప్టెంబర్ 5న డిఎండికే పార్టీనీ విజయ్ కాంత్ స్థాపించారు, 2006 తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు.

27 ఏళ్ళ వయసులో తెరంగేట్రం చేసిన విజయకాంత్ 2015 వరకు నిర్విరామంగా సినిమాలో నటించారు, కోలీవుడ్ (Kollywood) లో తెరకెక్కిన తొలి 3D చిత్రం అన్నయ్ భూమి (Annai Bhoomi) ఇందులో ఆయన రాధా రవి, కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్ తో కలిసి నటించారు, కన్నడ నటుడు విష్ణువర్ధన్, కోలీవుడ్ నటుడు కమలహాసన్, తమిళ నటుడు శివాజీ గణేషన్ తో కలిసి తెరను పంచుకున్నారు, ఒకానొక సమయంలో రజినీకాంత్ కమలహాసన్ కు గట్టి పోటీనీ విజయ్ కాంత్ ఇచ్చారు. సినిమాలో నెంబర్ వన్ పొజిషన్ కి రాకపోయినా అభిమానుల నుంచి కెప్టెన్ అనే ముద్ర ను సంపాదించుకున్నారు.

Actor Vijay Kanth Died: Actor Captain Vijay Kanth passed away due to Corona and serious health issues

 

1986 లో అమ్మన్ కోవిల్ కిజకలే (Amman Kovil Kizhakale) సినిమా కి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు (Best Film Fare Award) ని పొందారు, 1988 లో సింధూర పువ్వా (Sindhura Puva) సినిమా కీ బెస్ట్ యాక్టర్ గా తమిళనాడు స్టేట్ అవార్డు (Best Actor From Tamil Nadu State Award) పొందారు, 1996లో త్యాగం చిత్రానికి సంబంధించి తమిళనాడు స్టేట్ అవార్డు పొందారు అలాగే 1994లో తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎంజీఆర్ అవార్డ్ (MGR Award) పొందారు, 2001 లో గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు నుంచి మరోక అవార్డు పొందారు, 2011 లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్చి మేనేజ్మెంట్ నుంచి డాక్టరేట్ పొందారు.

విజయ్ కాంత్ మృతి పట్ల డిఎండికే కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీగా హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో సహా ఇతర సినీ ప్రముఖులు ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి వచ్చారు.

Comments are closed.