Jai Hanuman Poster : హ‌నుమాన్ పైకి డ్రాగ‌న్‌.. అస‌లు ఏం ఫ్లాన్ చేస్తున్నావ్ సామీ.

హనుమాన్ జయంతినాడు జై హనుమాన్ కొత్త పోస్టర్ లాంచ్, ఐమ్యాక్స్ 3డీ వెర్షన్‌లో రానున్న మూవీ

Jai Hanuman Poster : హనుమాన్ జయంతి సందర్భంగా, మేకర్స్ జై హనుమాన్ (Jai Hanuman) సినిమా నుండి అద్భుతమైన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సీక్వెల్ చిత్రం ఐమాక్స్ 3డి (IMAX 3D) లో కూడా విడుదల కానుండడం విశేషం. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ చిత్రం టాలీవుడ్‌లోనే కాకుండా భారతీయ సినిమా అంతటా సంచలనంగా మారింది.

ప్రస్తుతం ఈ చిత్రానికి జై హనుమాన్‌ అనే సీక్వెల్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన సినిమాను ప్రారంభించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆయన తాజాగా ఓ అద్భుతమైన పోస్టర్‌ను విడుదల చేశారు.

జై హనుమాన్ పోస్టర్ :

తేజ సజ్జ హనుమాన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిందో తెలుసా? 90 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన సంక్రాంతి చిత్రంగా నిలిచింది. ఈ సినిమా తర్వాత జై హనుమాన్ అనే సీక్వెల్ రానుందని ఇటీవలే కన్ఫర్మ్ అయింది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

Jai Hanuman Poster

ఊహించినట్లుగానే, ఈ పోస్టర్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంది. ఇందులో ఓ ఎత్తయిన శిఖరంపై చేతిలో గదతో హనుమాన్ నిల్చోగా, పైన గాల్లో నుంచి నిప్పులు కక్కుతూ ఓ డ్రాగన్ వస్తున్నట్లుగా ఈ పోస్టర్ రూపొందించారు. ఇండియన్ సినిమాలో తొలిసారి డ్రాగన్లను ప్రశాంత్ వర్మ తీసుకొస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తే స్పష్టమవుతోంది. అంతేకాదు హనుమాన్ కంటే ఈ జై హనుమాన్ మరో రేంజ్ లో ఉండనున్నట్లూ తెలుస్తోంది.

హనుమాన్ సినిమా ఘనవిజయం సాధించినందున దానికి సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తయింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి ఇది మరో చిత్రం. మొత్తంగా ఇండియన్ సూపర్ హీరోల సినిమాలు 12 తీయనున్నట్లు గతంలోనే అతడు చెప్పాడు. హనుమాన్ తర్వాత మరో హిందూ దేవుడే సూపర్ హీరోగా మరో సినిమా చేయనున్నాడు.

దానికి ముందు సీక్వెల్, జై హనుమాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు హనుమాన్ ఎండ్ క్రెడిట్స్ సమయంలోనే మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఇక ఈ సినిమాను ఐమ్యాక్స్ 3డీ వెర్షన్ లోనూ తీసుకురానున్నట్లు ఈ పోస్టర్ ద్వారా మేకర్స్ తెలిపారు.

Jai Hanuman Poster

Comments are closed.