Telugu Mirror : త్రిష కృష్ణన్ (Trisha Krishnan) దక్షిణాది మరియు హిందీ చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపుని సాధించుకున్న హీరోయిన్. ఎన్నో సినిమాలలో నటించి తన అందంతో మరియు నటనతో ఫాన్స్ కి మరింత దగ్గర అయిన త్రిష ఇప్పుడు ఎక్కువగా వార్తల్లో కనిపిస్తుంది. త్రిష కృష్ణన్ రెండు ఇండస్ట్రీలలో పని చేసింది అని మనకి తెలుసు. ఈ మధ్య కాలంలో మణిరత్నం దర్శకత్వం వహించిన PS1 మరియు PS2 అని పిలువబడే చారిత్రాత్మక నాటకం పొన్నియిన్ సెల్వన్‌లో అద్భుతంగా నటించింది ఈ నటి. ప్రస్తుతం ఆమె తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో వైరల్ అవుతోంది. ఆమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, మరియు ఆమె అద్భుతమైన అందం మరియు అత్యుత్తమ నటనా నైపుణ్యాలతో అందరి హృదయాలను గెలుచుకుంది. ప్రస్తుతం, త్రిష తన జీవితంలోని తదుపరి భాగాన్ని గడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తాజాగా సమాచారం వెలువడింది.
Also Read : గురక ఎందుకు వస్తుంది, తగ్గించుకోవాలంటే ఏం చేయాలి
త్రిష కృష్ణన్ తన జీవితంలో తదుపరి అడుగు వేయడానికి అనగా పెళ్లి (wedding) చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు మీడియాలో ఒక కథనం ద్వారా తెలిసింది. మలయాళ నిర్మాతగా చెప్పబడుతున్న తన కలల రారాజుతో త్రిష నిశ్చితార్థం చేసుకున్నట్లు నెటిజన్లు అంటున్నారు. అయితే ఇంతకీ ఇది ఎంత వరకు నిజం అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని మరియు ఈ విషయానికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన ఈ నటి చేయనున్నట్లు సమాచారం వచ్చింది. అయితే, ఈ తన పెళ్లి గురించి ఇంకా త్రిష నుండి ఎటువంటి ప్రకటన రాలేదనే చెప్పుకోవాలి. కొద్ది రోజుల క్రితం జరిగిన తన కొత్త సినిమా “పొన్నియిన్ సెల్వన్ 2” ప్రమోషన్ సందర్భంగా త్రిష కృష్ణన్ తాను పెళ్లికి సన్నాహాలు చేస్తున్న విషయాన్ని వెల్లడించింది.
ఈ విషయానికి సంబంధించి తాను ఇంకా ఎటువంటి చర్య తీసుకోలేదని ఆమె వెల్లడించింది. తాను మునుపటి ప్రకటనను ప్రస్తావిస్తూ, తన స్నేహితులు మరియు బంధువులు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ వాళ్ళు విడాకులు తీసుకోవాలనే ఆలోచనల్లో ఉన్నారని తెలియచేసింది. అయితే, జనవరి 23, 2015న, నటి త్రిషకు చెన్నైలో నివసించే వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగినట్లు మన అందరికీ తెలుసు. అయితే, కొన్ని నెలలు గడిచిన తర్వాత, త్రిష తాను మరియు తన కాబోయే భర్త తమ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. మరి! దాని వెనుక ఉన్న కారణాన్ని ఇంత వరకు బయటపెట్టలేదు.
Also Read : తొక్కే కదా అని పారేయకండి, నిమ్మకాయ తొక్కలతో బోలెడు ప్రయోజనాలు