Telugu Mirror : భారతదేశంలో 60 మిలియన్లకు పైగా Google Pay లేదా GPay వినియోగదారులు ఉన్నారు. భారత్ లో ఇది రెండవ అత్యంత ప్రజాదరణ పొందిన చెల్లింపు యాప్. ముఖ్యంగా DTH, వాటర్ బిల్, గ్యాస్ సిలిండర్‌లు, విద్యుత్ వంటి వాటికి సంబంధించిన బిల్లు చెల్లింపులు మరియు మొబైల్ రీఛార్జ్‌లు ఇతర సేవలు అయిన P2M మరియు P2P UPI లావాదేవీలకు బాగా గుర్తింపు పొందిన యాప్.
అయితే టెక్ నివేదికల తాజా సమాచారం ప్రకారం, Google Pay మొబైల్ రీఛార్జ్‌లపై వినియోగదారుల నుండి సాధారణ సౌకర్య రుసుమును (convenience Fee) వసూలు చేయడం ప్రారంభించింది. ఇంతకుముందు, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా వినియోగదారులు పూర్తిగా ఉచిత సేవను Google Pay కల్పించేది. కేవలం టెలికాం ఆపరేటర్ కి మాత్రమే ధరను చెల్లించాల్సి వచ్చేది. దీని బట్టి Google భారతదేశం యొక్క బహుళ-బిలియన్ డాలర్ల డిజిటల్ చెల్లింపుల పరిశ్రమ నుండి ఆదాయాన్ని సంపాదించడానికి Google ప్రస్తుతం మార్గాలను పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది.
SBI PO 2023 మెయిన్స్ అడ్మిట్ కార్డ్ ను డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ఇప్పుడే తెలుసుకోండి
అంకుష్ అనే ఆన్లైన్ వినియోగదారుడు దేశీడైమ్ (Desi Dime) అనే ఆన్లైన్ ఫోరం లో ఈ విధంగా అన్నాడు. Google Pay మొబైల్ రీఛార్జ్‌లపై అదనపు సౌకర్య రుసుమును వసూలు చేయడం ప్రారంభించిందని పేర్కొన్నాడు. Google Pay యాప్ ద్వారా అతను రూ. 749 జియో రీఛార్జ్ చేసుకున్నాడు. ఆ తర్వాత గూగుల్ అధనంగా రూ. 3 వసూలు చేయడం గమనించాడు. అతను UPIతో రీఛార్జ్ చేసాడని అదనపు చార్జిలు పడే అవకాశం ఉండదు ఎందుకంటే తాను క్రెడిట్ కార్డ్‌తో ఏమి రీఛార్జి చేయలేదు అని స్పష్టంగా చెప్పాడు.
ప్రస్తుతానికి, Google Pay మొబైల్ రీఛార్జ్‌ల కోసం మాత్రమే ఈ ఖర్చులను వసూలు చేస్తుంది. యుటిలిటీ బిల్లు చెల్లింపులు వంటి ఇతర లావాదేవీలు ఉచితంగా ఉంటాయి మరియు Google Payలో వ్యక్తిగత మరియు వ్యాపార ప్రయోజనాలు కోసం UPI లావాదేవీలు కూడా ఉచితంగా ఉంటాయి.
అమెజాన్ అందిస్తున్న జనరేటివ్ AI ఉచిత తరగతుల గురించి ఇప్పుడే తెలుసుకోండి.
అయితే ఇక్కడ ఒక్క విషయం గమనించాల్సి ఉంది. మొబైల్ రీఛార్జ్‌ల కోసం కన్వీనియన్స్ ఫీజులను వసూలు చేసే మొదటి యాప్ Google Pay ఒకటే కాదు. PhonePe మరియు PayTM కూడా రీఛార్జ్‌ల కోసం వినియోగదారులకు ప్లాట్‌ఫారమ్ ఫీజులను సేకరించడం కొన్ని నెలల క్రితమే ప్రారంభించబడింది.
ఈ విషయంపై Google ఎక్కడ అధికారంగా ప్రకటించలేదు కానీ మేము తెలుసుకున్న విషయం ఏమిటంటే నవంబర్ 10, 2023న, Google భారతదేశం కోసం తన సేవా నిబంధనలను (Terms Of Service)ని సవరించింది.