Guppedantha manasu serial feb 9th episode : తెలుగు టీవీ సీరియల్స్ లో గుప్పెడంత మనస్సు సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో ఉన్న సీరియల్స్ లో ఒకటి. ప్రజాదరణ పొందిన సీరియల్స్ లో ఒకటైన గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరగనుందో తెలుసుకుందాం.
నేను ఎవరి కోసం బ్రతకాలి..
మహీంద్ర ఒక్కడే చెట్టు కింద కూర్చొని బాధపడుతూ ఉంటాడు. రిషిని తలచుకొని ఏడుస్తాడు. రిషి జ్ఞాపకాలను తలచుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు. తట్టుకోలేక డ్రింక్ చేయబోతుండగా అనుపమ వచ్చి ఆ బాటిల్ తీసుకుంటుంది. ఏంటి మహీంద్ర ఇది, నువ్వు ఇలా చేస్తే ఎలా మహీంద్ర అని అంటుంది. జగతి నన్ను వదిలిపోయింది ఆ తర్వాత రిషియే నా ప్రాణం అనుకోని బ్రతిక అని మహీంద్ర చెబుతాడు. జగతి, రిషి వారిద్దరే నా ప్రాణం ఇప్పుడు వాళ్ళే లేరు ఇంకా నేను ఎవరి కోసం బ్రతకాలి అని మహీంద్ర అంటాడు.
వసుధార కోసం బతకాలి అని అనుపమ చెబుతుంది. రిషియే ప్రాణం అనుకొని బతుకుతుంది. రిషి చనిపోయిన కూడా బ్రతికే ఉన్నాడు అనే భ్రమలో బతుకుతుంది, తనని ఆ స్థితిలో నుండి బయటికి తీసుకురావాలని చెబుతుంది. మహీంద్ర, అనుపమ వసుధార దగ్గరకు వస్తారు.
వసు కోసం రాజీవ్ ఆరాటం..
Also Read : Guppedantha Manasu serial feb 8th episode : రిషికి సంతాపసభ ఏర్పాటు, శైలేంద్ర పై చేయి చేసుకున్న వసు
వసుధార మరియు ఆమె నాన్న ఇద్దరు దిగులుగా కూర్చుంటారు. ఇంతలో పూలమాల తీసుకొని రాజీవ్ వస్తాడు. వసు వాళ్ళ నాన్న రాజీవ్ మీద సీరియస్ అవుతాడు. నువ్వు ఎవర్రా? అసలు ఇక్కడికి వచ్చావ్ అని అడుగుతాడు. అదేంటి మామయ్య, నేను నీ అల్లుడిని, ఇంతకముందు నా అల్లుడు బంగారం అది ఇది అన్నావ్ కదా ఇప్పుడు చాలా మారిపోయావు మామయ్య అని రాజీవ్ మాటలు చెబుతాడు.
అసలే ఇప్పుడు మళ్ళీ పిల్లని ఇవ్వాలి కదా అని రాజీవ్ అంటాడు. పాపం వసు, తల్లిని పోగొట్టుకుంది, దేవత లాంటి జగతి మేడంని పోగొట్టుకుంది,ఇప్పుడు రిషి సార్ ని కూడా పోగొట్టుకుంది మళ్ళీ నేను కూడా పోతే వసు ఒంటరిది అవుతుంది అని అంటాడు రాజీవ్. రిషి కి దండ వేసి వెళ్దాం అని వచ్చా అని చెప్పి రిషి ఫోటోకి దండ వేస్తుంటే వసుధార ఆ దండ తీసి పడేస్తుంది.
బ్రతికి ఉన్నప్పుడు ఎలాగో మేము శత్రువులం చనిపోయాక అయిన ఫ్రెండ్ లాగా దండ వేసి సంతాపం తెలుపుదామని వచ్చాను అని రాజీవ్ అంటాడు. ఇంకా కాసేపు ఇక్కడే ఉంటె పోలీసులకి ఫోన్ చేయాల్సి ఉంటుంది అని వసుధార చెబుతుంది. అసలే తప్పించుకొని తిరుగుతున్నాను, ఎందుకులే అని రాజీవ్ వెళ్ళిపోతాడు.